News February 17, 2025
బాపట్ల జిల్లాలో GBS వ్యాధిపై అవగాహన

గిలియన్ బార్ సిండ్రోమ్ వ్యాధిపై ప్రజలలో అవగాహన కల్పిస్తూ వ్యాప్తిని ఆరికట్టాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ ద్వారా చేపట్టిన అభా కార్డుల నమోదు ప్రక్రియ, గిలియన్ బార్ సిండ్రోమ్ వ్యాధి వ్యాప్తిపై జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులతో సోమవారం బాపట్ల కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వీడియో సమావేశం నిర్వహించారు. ప్రజలు వ్యాధి బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Similar News
News November 5, 2025
బాపట్ల: మద్యం తాగి బస్సు నడుపిన డ్రైవర్

బాపట్ల జిల్లా SP ఆదేశాల మేరకు మార్టూరు సీఐ శేషగిరిరావు, రవాణాశాఖ అధికారులు NH–16పై మంగళవారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. అతివేగంగా వస్తున్న ఇంటర్ సిటీ స్మార్ట్ బస్ను తనిఖీ చేయగా.. డ్రైవర్ మద్యం తాగి డ్రైవింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. బస్ డ్రైవర్ను తనిఖీ చేయకుండా పంపిన మేనేజర్, కెప్టెన్లపై కూడా చర్యలు చేపట్టారు.
News November 5, 2025
న్యూయార్క్ మేయర్గా జోహ్రాన్ మమ్దానీ

అమెరికా ఆర్థిక రాజధాని అయిన న్యూయార్క్ నగర మేయర్గా జోహ్రాన్ మమ్దానీ (34) ఎన్నికయ్యారు. ఈ ఘనత సాధించిన తొలి ముస్లిం, భారతీయ మూలాలు ఉన్న వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు. ఈ శతాబ్దంలో అత్యంత పిన్న వయసులో న్యూయార్క్ మేయర్ అయిన ఘనత కూడా ఈయనదే. డెమొక్రటిక్ పార్టీ నుంచి పోటీ చేసిన జోహ్రాన్ స్వతంత్ర అభ్యర్థి ఆండ్రూపై గెలిచారు. మమ్దానీ తల్లిదండ్రులు ఇండియాలో జన్మించారు.
News November 5, 2025
ఆలయాల వద్ద పటిష్ఠ బందోబస్తు: వరంగల్ సీపీ

కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయాల వద్ద పటిష్ఠమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ పోలీసు అధికారులను ఆదేశించారు. ఇటీవల జరిగిన ఘటన దృష్టిలో ఉంచుకుని తోపులాటలు లేకుండా భక్తులు క్యూలైన్లలో కొనసాగేలా ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ సిబ్బంది సాయం తీసుకోవాలని సీపీ పేర్కొన్నారు.


