News January 30, 2025

బాపట్ల జిల్లాలో MLC ఎన్నికలు.. ఎక్కడెక్కడంటే.!

image

బాపట్ల జిల్లాలో MLC ఎన్నికల నగారా మోగిన విషయం తెలిసిందే. అయితే <<15306092>>బాపట్ల జిల్లాలోని<<>> వేమూరు, కొల్లూరు, చుండూరు, భట్టిప్రోలు, అమృతలూరు, నిజాంపట్నం, నగరం, రేపల్లె, బాపట్ల, పిట్టలవానిపాలెం మండలాల్లో మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. కాగా గ్రాడ్యుయేట్ MLCగా ఉన్న KS లక్ష్మణరావు మరోసారి పోటీ చేయనుండగా.. కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌తోపాటు మరికొందరు స్వతంత్ర అభ్యర్థులు పోటీకి సిద్ధమయ్యారు.

Similar News

News November 4, 2025

ధాన్యం తరలింపుపై కలెక్టర్ సమీక్ష

image

వర్షాల దృష్ట్యా ధాన్యం కొనుగోలు కేంద్రాలపై జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ మంగళవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కొనుగోలు పూర్తయిన ధాన్యాన్ని వెంటనే ట్యాగ్ చేసిన మిల్లులకు తరలించాలని పోలీస్, రెవెన్యూ, మార్కెటింగ్, సివిల్ సప్లై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వర్షాల నుంచి ధాన్యాన్ని కాపాడేందుకు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

News November 4, 2025

NLG: పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్

image

వివిధ ప్రాజెక్టుల కింద మిగిలిపోయిన భూసేకరణ పనులు, పునరావాస కాలనీల పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇంజినీరింగ్, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె తన చాంబర్లో జిల్లాలోని వివిధ ప్రాజెక్టుల కింద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, ఎత్తిపోత పథకాల కింద భూసేకరణ, పునరావస పనులపై సమీక్ష నిర్వహించారు.

News November 4, 2025

విశాఖలో టుడే టాప్ న్యూస్

image

➤ విశాఖలో పలు చోట్ల కంపించిన భూమి
➤ భాగ‌స్వామ్య స‌ద‌స్సు ఏర్పాట్లను పరిశీలించిన క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్
➤ మార్గశిర మాసోత్సవాల నిర్వహణపై కలెక్టర్ సమీక్ష
➤ కంచరపాలెంలో నవంబర్ 7న జాబ్ మేళా
➤ శ్రీకాకుళం నుంచి చర్లపల్లికి రైళ్లు: కేంద్ర మంత్రి
➤ కార్తీక పౌర్ణమి బీచ్ స్నానాలపై మెరైన్ పోలీసులు విజ్ఞప్తి
➤ విశాఖలో బహిరంగ మద్యపానంపై డ్రోన్‌తో నిఘా