News December 14, 2025

బాపట్ల: జిల్లాస్థాయి ఖో..ఖో పురుషుల జట్టు ఎంపిక

image

పంగులూరు మండల కేంద్రంలోని జూనియర్ కళాశాల వద్ద ఉమ్మడి ప్రకాశం జిల్లా స్థాయి ఖో..ఖో పురుషుల జట్టును శనివారం ఎంపిక చేసినట్లు ఖో..ఖో భారత సమాఖ్య ఉపాధ్యక్షుడు సీతారామరెడ్డి తెలిపారు. జిల్లా స్థాయిలో ఎంపికైన ఈ జట్టు ఈనెల 24, 25, 26 తేదీల్లో కృష్ణాజిల్లా గుడివాడలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని వెల్లడించారు.

Similar News

News December 14, 2025

FLASH: సంగారెడ్డి జిల్లాలో ప్రారంభమైన జీపీ ఎన్నికల పోలింగ్

image

సంగారెడ్డి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రారంభమైంది. జిల్లాలోని 10 మండలాల్లో 229 జీపీల్లో 649 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 14 జీపీలు ఏకగ్రీవమయ్యాయి. మొత్తం ఓటర్లు 2,99,746 ఉండగా ఇందులో పురుషులు 1,45,985, స్త్రీలు 1,51,757 ఉన్నారు. గ్రామపంచాయతీ వార్డు స్థానాలు 1,941 కాగా, 4,526 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పోలీసు బందోబస్తు మధ్య ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది.

News December 14, 2025

VZM: బంగారం కోసం గొంతు నులిమి హత్య

image

భోగాపురం మండలంలోని ఆర్అండ్ఆర్ కోలనీలో దారుణం జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న 70 ఏళ్ల అప్పయ్యమ్మను గుర్తు తెలియని వ్యక్తులు గొంతు నులిమి హత్య చేసి, ఆమె వద్ద ఉన్న రెండు తులాల బంగారాన్ని అపహరించారు. అనంతరం మృతదేహాన్ని వాటర్ ట్యాంక్ వద్ద వదిలేసి పరారయ్యారు. సమాచారం అందుకున్న డీఎస్పీ ఆర్ గోవిందరావు, సీఐ దుర్గా ప్రసాద్ ఘటనా స్థలాన్ని శనివారం పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News December 14, 2025

నంద్యాల జిల్లాలో చికెన్ ధరలు

image

నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. వెలుగోడు, గడివేముల, కొత్తపల్లి మండలాల్లో కొంతమేర ధరలు పెరిగాయని వ్యాపారులు తెలిపారు. లైవ్ కిలో రూ.195, స్కిన్‌ రూ.210, స్కిన్‌లెస్ రూ.220-250 చొప్పున విక్రయిస్తున్నారు. మటన్ కిలో రూ.800-900, చేపలు రూ.180 చొప్పున అమ్ముతున్నారు. ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉన్నాయి.