News March 27, 2026
బాపట్ల జిల్లా ఎస్పీ హెచ్చరిక

యువత క్రికెట్ బెట్టింగులకు దూరంగా ఉండాలని ఎస్పీ బి.ఉమామహేశ్వర్ తెలిపారు. ఈనెల 28 నుంచి దేశవ్యాప్తంగా ఐపీఎల్ సీజన్ మొదలవుతున్న నేపథ్యంలో క్రికెట్ బెట్టింగులపై ఎస్పీ శుక్రవారం హెచ్చరికలు చేశారు. క్రికెట్ బెట్టింగ్ పెనుభూతం లాంటిదని దానికి ఎవరు బలికావద్దన్నారు. బెట్టింగులకు పాల్పడినా, ఇతరులను ప్రోత్సహించినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News April 16, 2026
కర్నూలు: అనారోగ్యం బారిన పడినా.. ఇంటర్‌లో అద్భు ప్రతిభ

కర్నూలు(D) పెద్దకడుబూరుకు చెందిన బొగ్గుల హరిత ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచింది. వ్యవసాయ కూలీలు బొగ్గుల పరమేశ్, జ్యోతి దంపతుల కుమార్తె హరిత 6 నెలలుగా అనారోగ్యంతో బాధపడినా ధైర్యంగా కోలుకుని పరీక్షలకు హాజరై 1000 మార్కులకు 956 మార్కులు సాధించింది. ఆమె విజయంపై గ్రామ ప్రజలు, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. హరిత భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించారు.
News April 16, 2026
బాహ్యరూపం చూసి అంచనా వేయొద్దు!

మిరెము గింజ చూడ మీద నల్లగనుండు
కొరికి చూడ లోనంజురు మనును
సజ్జనులగువారి సార మిట్లుండురా
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: మిరియపు గింజ పైకి నల్లగా, అందవిహీనంగా ఉన్నప్పటికీ కొరికినప్పుడు దాని పనితనం తెలుస్తుంది. అలాగే సజ్జనులు పైకి సామాన్యంగా కనిపించినా వారి లోపల అపారమైన జ్ఞానం, మంచి గుణాలు ఉంటాయి.
<<-se>>#PADHYAM<<>>
News April 16, 2026
VKB జిల్లా భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి!

జిల్లాలో భూగర్భ జల మట్టం రోజురోజుకూ ఆందోళనకరంగా పడిపోతోంది. జిల్లాలో సగటున 13.9 మీటర్ల లోతుకు నీటి నిల్వలు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. ఎండల తీవ్రత పెరగడం, వర్షపాతం తగ్గడం మరియు విచ్చలవిడిగా బోర్లు వేయడమే ఇందుకు ప్రధాన కారణాలని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడి మొదలవ్వడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.


