News March 15, 2025
బాపట్ల జిల్లా కలెక్టర్ సూచనలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్ర స్వచ్ఛత దివాస్ కార్యక్రమం శనివారం సూర్యలంక బీచ్‌లో జరగనుంది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి పాల్గొంటున్నట్లు కలెక్టర్ కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు, అధికారులు పాల్గొంటున్నట్లు తెలిపారు.
Similar News
News September 17, 2025
హైదరాబాద్ సంస్థానం.. తెలంగాణ ప్రస్థానం

8 తెలుగు, 3 కన్నడ, 5 మరాఠీ జిల్లాల సమూహమే హైదరాబాద్ సంస్థానం. దేశంలోని 550 సంస్థానాల్లో అతిపెద్దది. నాడు కోటీ 80 లక్షల జనం ఉంటే ఇందులో 50 శాతం తెలుగువారే. 25 శాతం మరాఠీ, 12 శాతం ఉర్దూ, 11 శాతం కన్నడ, ఇతర భాషాల వారు HYD సంస్థానంలో ఉండేవారు. ప్రపంచంలోనే ధనికుల్లో ‘నిజాం’ ఒకడిగా ఉండేవారని చరిత్ర చెబుతోంది. 1948 SEP 17న ఈ సంస్థానం ఆపరేషన్ పోలోతో భారత్‌లో విలీనమైంది. తెలంగాణ ప్రస్థానం మొదలైంది.
News September 17, 2025
నేడు విశాఖకు సీఎం చంద్రబాబు

AP: ఇవాళ CM చంద్రబాబు విశాఖకు వెళ్లనున్నారు. AU కన్వెన్షన్ సెంటర్లో జరిగే ‘స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమంలో పాల్గొంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో OCT 2వరకు చేపట్టనున్న ప్రత్యేక వైద్య శిబిరాల ప్రారంభోత్సవంలో ప్రసంగిస్తారు. మ.3 గంటలకు రాడిసన్ బ్లూ రిసార్ట్స్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఆధ్వర్యంలో జరిగే సదస్సులో పాల్గొంటారు. తర్వాత VJA బయల్దేరతారు.
News September 17, 2025
TPT: మిగిలిన సీట్లకు దరఖాస్తుల ఆహ్వానం

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కాలేజీల్లో మిగిలిన సీట్లకు 4వ విడత దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తిరుపతి ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ గణేశ్ చెప్పారు. పదో తరగతి పాస్/ ఫెయిల్ అయిన అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. https://iti.ap.gov.in/ వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. చివరి తేదీ సెప్టెంబర్ 27.