News February 24, 2026

బాపట్ల జిల్లా కలెక్టర్ హెచ్చరిక

image

ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకే ప్రైవేట్ అంబులెన్స్ యజమానులు ఛార్జీలు వసూలు చేయాలని కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ స్పష్టం చేశారు. కలెక్టర్ కార్యాలయంలో అంబులెన్స్ రవాణా చార్జీల పోస్టర్‌ను ఆవిష్కరించి, అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫిర్యాదుల కోసం 7702806804 టోల్ ఫ్రీ నంబర్‌కు లేదా డీఎంహెచ్‌ఓ కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని సూచించారు.

Similar News

News February 26, 2026

కాకినాడ: రూ.53కు ఫుడ్ ఆర్డర్.. రూ.5 లక్షలు మాయం!

image

తక్కువ ధరకే ఆహారం ఆర్డర్ చేసిన ఓ వృద్ధుడు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు. రామారావుపేటకు చెందిన హనుమంతరావు(77) రూ.53 ఫుడ్ ఆర్డర్‌కు డెలివరీ బాయ్ రూ.111 వసూలు చేయడంతో నిలదీశారు. అతను ఇచ్చిన కస్టమర్ కేర్ నంబర్‌కు ఫోన్ చేయగా, ఆ తర్వాత రెండు రోజుల్లోనే ఆయన ఖాతా నుంచి సైబర్ కిలాడీలు రూ.5 లక్షలకు పైగా కాజేశారు. దీనిపై బాధితుడు టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News February 26, 2026

ఇద్దరి మృతి.. అండగా ఉంటా: ఇల్లందు ఎమ్మెల్యే

image

నిన్న జరిగిన ప్రమాదంలో తల్లి, కూతురు మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోరం కనకయ్య బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. పోస్టుమార్టం ప్రక్రియపై డాక్టర్లతో, కేసు దర్యాప్తుపై సీఐతో మాట్లాడారు. ప్రమాదానికి కారకులైన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.

News February 26, 2026

చిత్తూరు జిల్లాలో RDOల బదిలీ

image

కుప్పం RDO శ్రీనివాసరాజును బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న 26 మంది రెవిన్యూ డివిజన్ ఆఫీసర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇందులో భాగంగా కుప్పం RDO శ్రీనివాసరాజు, నగరి RDO భవాని శంకర్‌ను ట్రాన్స్‌ఫర్ చేసింది. ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి వద్ద రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.