News September 12, 2025
బాపట్ల జిల్లా కొత్త కలెక్టర్ గతంలో ఏం చేసేవారంటే.!

బాపట్ల నూతన కలెక్టర్‌గా నియమితులైన డాక్టర్ వినోద్ కుమార్ మొదటిగా MBBS పూర్తి చేసి డాక్టర్ అయ్యారు. అనంతరం 2004-05 IAS బ్యాచ్‌కు ఎంపికయ్యారు. అనంతపురం ఉమ్మడి జిల్లా ట్రైనీ కలెక్టర్‌గా కెరీర్ ప్రారంభించారు. AP స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ MD, రంపచోడవరం సబ్ కలెక్టర్, నెల్లూరు JCగా సేవలందించారు. 2024 ఏప్రిల్ 3 నుంచి అనంతపురం కలెక్టర్ సేవలందించారు.
Similar News
News March 9, 2026
మహిళలూ HYD వెళ్తున్నారా… అయితే త్వరలో మీకోసం ఓ యాప్

TG: విద్య, ఉపాధి కోసం ఇతర ప్రాంతాల నుంచి HYDకి వచ్చే మహిళల కోసం ఓ యాప్‌ను GOVT తెస్తోంది. వారికి వసతి, భద్రత కల్పించే లక్ష్యంతో దీన్ని రూపొందిస్తోంది. యాప్ ద్వారా GOVT, గుర్తింపు పొందిన వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లలోని రూములను ముందుగా బుక్ చేసుకోవచ్చు. హాస్టళ్లలో CCTV కెమెరాలు, సెక్యూరిటీతో పటిష్ఠ ఏర్పాట్లుంటాయి. TNలో అమల్లో ఉన్న ఇలాంటి యాప్‌ను పరిశీలించిన అధికారులు త్వరలో ఇక్కడా ప్రారంభించనున్నారు.
News March 9, 2026
ICC టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ ఇదే

T20WC-2026 టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌ను ఐసీసీ ప్రకటించింది. 11 మందిలో భారత్ నుంచి నలుగురికి చోటు దక్కింది. సౌతాఫ్రికా ప్లేయర్ మార్క్రమ్‌ను కెప్టెన్‌గా ప్రకటించింది.
టీమ్: సంజూ శాంసన్, ఫర్హాన్ (పాక్), ఇషాన్ కిషన్, మార్క్రమ్ (C), హార్దిక్ పాండ్య, విల్ జాక్స్, జేసన్ హోల్డర్, బుమ్రా, ఎంగిడి, ఆదిల్ రషీద్, ముజరబానీ (జింబాబ్వే).
*12వ ఆటగాడిగా స్కాల్విక్ (USA)
> జట్టు ఎలా ఉందో COMMENT చేయండి.
News March 9, 2026
భూపాలపల్లి: ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంఆర్ఐ ఏర్పాటు: కలెక్టర్ పరిశీలన

భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో త్వరలో MRI సేవలు అందుబాటులోకి రానున్నాయి. సోమవారం కలెక్టర్ రాహుల్ శర్మ ఆసుపత్రిని సందర్శించి, ఎంఆర్ఐ యంత్రం ఏర్పాటుకు కేటాయించిన గదులు, మౌలిక వసతులను పరిశీలించారు. పనులను వేగవంతం చేసి సామాన్య ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు త్వరగా అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ సౌకర్యంతో పేద రోగులకు వ్యయప్రయాసలు తప్పుతాయని ఆయన పేర్కొన్నారు.


