News March 21, 2025
బాపట్ల జిల్లా గీతాన్ని పాడాలని సింగర్ మనోను కోరిన కలెక్టర్

బాపట్ల జిల్లా గీతాన్ని పాడాలని జిల్లా కలెక్టర్ జె .వెంకట మురళి చేసిన విజ్ఞప్తి మేరకు ప్రముఖ గాయకులు (మనో)నాగుర్ బాబు శుక్రవారం జిల్లా కలెక్టర్‌ను కలిశారు. చందోలు బంగ్లాముఖి దేవాలయానికి వెళ్తూ మార్గమధ్యలో ఆయన కలెక్టర్ ను కలిశారు. వారిరువురూ 10 నిమిషాల పాటు జిల్లా గీతంపై చర్చించుకున్నారు. కలెక్టర్ కోరిక మేరకు బాపట్ల జిల్లా గీతాన్ని ఆలపించడానికి మనో అంగీకరించారు.
Similar News
News November 2, 2025
వనపర్తి: బాల్యవివాహాలు చేస్తే కఠిన చర్యలు

బాల్య వివాహాలు చేస్తే అందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరి పై చట్టరీత్య కేసులు నమోదు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదివారం తెలిపారు. అమ్మాయిలు 18 సం. పూర్తి అయ్యే వరకు వారిని కచ్చితంగా చదివించాలన్నారు.18 సంవత్సరాల లోపే పెళ్లి చేస్తే అందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరిపై కేసు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.
News November 2, 2025
వరంగల్: హరీష్ రావును పరామర్శించిన కొండా మురళీ

మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తండ్రి సత్యనారాయణరావు ఇటీవల మృతి చెందారు. ఈ మేరకు మాజీ మంత్రి హరీష్ రావును మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సత్యనారాయణరావు చిత్రపటానికి కొండా మురళీ పూలమాల వేసి నివాళులర్పించారు.
News November 2, 2025
రేపు కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్ కార్యక్రమం: కలెక్టర్

అనంతపురం జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఆనంద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లా ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా అందజేయాలన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.


