News April 16, 2025

బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రకార్ జైన్ బదిలీ

image

బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రకార్ జైన్‌ను బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ విజయానంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనను రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ (RTGS)కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. నూతన జాయింట్ కలెక్టర్ నియమించే వరకు బాపట్ల జిల్లాకు ఇన్‌ఛార్జ్ జాయింట్ కలెక్టర్‌ను నియమించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Similar News

News December 24, 2025

రాస్కోండి.. 29లో 2/3 మెజార్టీ పక్కా: రేవంత్

image

TG: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 2/3 మెజార్టీతో గెలుస్తుందని CM రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. ‘2029లో 119 సీట్లే ఉంటే 80కి పైగా సాధిస్తాం. ఒకవేళ 150 (నియోజకవర్గాల పునర్విభజన) అయితే 100కు పైగా గెలుస్తాం’ అని కోస్గిలో ప్రకటించారు. ‘చంద్రశేఖర్ రావు, హరీశ్ రావు, దయాకర్ రావు సహా BRS రావులంతా ఇది రాసి పెట్టుకోండి’ అని ఛాలెంజ్ విసిరారు. తాను ఉన్నంత వరకూ BRSను అధికారంలోకి రానివ్వనని స్పష్టం చేశారు.

News December 24, 2025

EV ఛార్జింగ్ స్లో అయిందా? కారణాలివే

image

EVలలో వినియోగించే లిథియం-అయాన్ బ్యాటరీలు టెంపరేచర్ సెన్సిటివ్‌గా ఉంటాయి. వింటర్లో ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టినప్పుడు కరెంట్ ఫ్లోకు ఎక్కువ టైమ్ పడుతుంది. అధునాతన EVల్లో వాతావరణంలో మార్పులను తట్టుకునేలా బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టం ఏర్పాటు చేశారు. బ్యాటరీ హెల్త్ కాపాడేందుకు ఛార్జింగ్ స్పీడ్, కెమికల్ రియాక్షన్స్‌ను తగ్గిస్తుంది. కొన్ని EVల్లో ఫాస్ట్ ఛార్జింగ్‌కు ముందు బ్యాటరీని ప్రీకండిషనింగ్ చేయొచ్చు.

News December 24, 2025

మెరుపు డెలివరీ వెనుక మైండ్ గేమ్!

image

క్విక్ కామర్స్ సంస్థలు మెరుపు వేగంతో డెలివరీ చేస్తూ ప్రజల జీవనశైలిని మారుస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డేటా అనలిటిక్స్‌ టెక్నాలజీని వాడి ఈ యాప్స్ మీ అవసరాలను ముందే అంచనా వేస్తాయి. ఆర్డర్ చేయగానే ‘డార్క్ స్టోర్స్‌’లో సిద్ధంగా ఉన్న వస్తువులను ప్యాక్ చేసి 10ని.ల్లో డెలివరీ చేస్తాయి. వీటివల్ల ప్రజల్లో ఓపిక తగ్గిపోవడంతో పాటు వస్తువులను నిల్వ చేసుకునే ప్రణాళికాబద్ధమైన అలవాటు కనుమరుగవుతోంది.