News January 7, 2026

‘బాపట్ల జిల్లా టాప్-3లో ఉండాలి’

image

రెవెన్యూ, హెల్త్, అగ్రికల్చర్ నిర్వహణలో రాష్ట్ర స్థాయిలో బాపట్ల జిల్లా టాప్-3లో ఉండేలా అధికారులు పనిచేయాలని కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. మంగళవారం జిల్లాలో పలు అంశాలపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. పీజీఆర్‌ఎస్‌లో వచ్చే సమస్యల అర్జీల శాతం తగ్గించాలన్నారు. రెవెన్యూ రికార్డ్స్ అన్నింటినీ ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేయాలన్నారు.

Similar News

News February 5, 2026

టీచర్‌గా మారిన విజయనగరం కలెక్టర్

image

నిరక్షరాస్యత నిర్మూలనతోనే సమాజాభివృద్ధి సాధ్యమని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం విజయనగరం మండలం దుప్పాడలో ‘ఉల్లాస్’ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న అక్షరాంధ్ర కేంద్రాన్ని ఆయన సందర్శించారు. టీచర్‌గా మారి మహిళలకు పాఠాలు బోధించారు. మహిళలు చదువుకుంటే కుటుంబం ప్రగతిపథంలో పయనిస్తుందన్నారు. డీఆర్డీఏ పీడీ శ్రీనివాసపాణి పాల్గొన్నారు.

News February 5, 2026

ఉమ్మడి విశాఖలో పోస్టాఫీస్ ఉద్యోగాలు.. ఖాళీలు ఇవే

image

విశాఖ, అనకాపల్లి డివిజన్ల పరిధిలోని ఆనందపురం, దుర్గానగర్, కించుమండ, కోడూరు, ధారకొండ తదితర 57 చోట్ల బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రూ.12వేల నుంచి రూ.24,470 జీతం లభిస్తుంది. పదో తరగతి పాసైతే చాలు. ఖాళీల వివరాల కోసం ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

News February 5, 2026

ఫార్మర్ రిజిస్ట్రేషన్ త్వరగా పూర్తి చేయాలి: నిర్మల్ కలెక్టర్

image

నిర్మల్ జిల్లాలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించారు. రైతులందరికీ ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందాలంటే రిజిస్ట్రేషన్ కీలకమని తెలిపారు. క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండి, ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని, ఎక్కడా జాప్యం జరగకూడదని స్పష్టం చేశారు.