News December 20, 2025
బాపట్ల జిల్లా పోలీసులకు ప్రతిష్ఠాత్మక రాష్ట్రస్థాయి అవార్డ్

జిల్లా పోలీసులకు ప్రతిష్ఠాత్మక రాష్ట్రస్థాయి అవార్డు వరించింది. శుక్రవారం రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో ఎస్పీ ఉమామహేశ్వర్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా నుంచి అవార్డు ఫర్ బెస్ట్ క్రైమ్ డిటెక్షన్ అందుకున్నారు. కొందరు పర్యాటక శాఖకు చెందిన వెబ్ సైట్లను పోలిన నకిలీ సైట్లను సృష్టించి ప్రజలను మోసం చేస్తున్నారు. ఈ కేసులను సమర్థవంతంగా చేదించినందుకు డీజీపీ అవార్డును అందించినట్లు వివరించారు.
Similar News
News December 20, 2025
మామిడిలో మంచి పూత కోసం ఏం చేయాలి?

మామిడిలో పూమొగ్గలను ఉత్తేజపరిచి త్వరగా పూత తెప్పించడానికి, ఆడపూల శాతం పెంచడానికి లీటరు నీటికి పొటాషియం నైట్రేట్ 10గ్రా., లీటరు నీటికి బోరాన్ 2గ్రా. కలిపి పిచికారీ చేయాలి. పూమొగ్గ దశలో తేనెమంచు పురుగు నివారణకు లీటరు నీటికి క్లోరిపైరిఫాస్ 2.5ml కలిపి పూత మొదలయ్యే సమయం, పిందెలు తయారయ్యే సమయంలో పూత, ఆకులపైనే కాకుండా మొదళ్లపైన, కొమ్మలపైన కూడా పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
News December 20, 2025
నేటి నుంచి పుష్య మాసం.. ఇలా చేయండి!

పుష్య మాసం పుణ్య మాసం. పుష్యమి నక్షత్రం వల్ల ఈ పేరొచ్చింది. ఈ మాసం శనిదేవునికి ప్రీతికరమైనది. ఆయనను పూజిస్తే కష్టాలు తొలగి శుభాలు కలుగుతాయని నమ్మకం. విష్ణుమూర్తిని తులసీ దళాలతో పూజిస్తే సౌందర్యం, శివుడిని మారేడు దళాలతో అర్చిస్తే ఐశ్వర్యం లభిస్తాయని శాస్త్ర వచనం. ఈ నెలలో చేసే గింజంత దానమైనా అనంత పుణ్యఫలాన్ని ఇస్తుందని అంటారు. నదీ స్నానాలు, సూర్యారాధనతో ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని పండితుల వాక్కు.
News December 20, 2025
అడిషనల్ కలెక్టర్ల లంచాల దందా..! సీఎం సీరియస్

TG: భూభారతి సమస్యలు తీర్చేందుకు జిల్లాల్లో అడిషనల్ కలెక్టర్లు లంచాలు తీసుకుంటున్నారంటూ సీఎంవోకు ఫిర్యాదులు వస్తున్నాయి. అన్నీ సక్రమంగా ఉన్నా ఫైల్‌పై సంతకం పెట్టాలంటే లంచం డిమాండ్ చేస్తున్నారని రైతులు పేర్కొంటున్నారు. దీంతో ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. రైతులను ఇబ్బంది పెడుతున్న అధికారులను ఉపేక్షించేది లేదని హెచ్చరించినట్లు సమాచారం. ఫైళ్ల పెండింగ్‌పై సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు.


