News April 13, 2025
బాపట్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో PGRS రద్దు- ఎస్పీ

బాపట్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదివారం ప్రకటించారు. సోమవారం అంబేడ్కర్ జయంతి పురస్కరించుకొని పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి అర్జీలు అందజేసేందుకు కార్యాలయానికి రావద్దని సూచించారు.
Similar News
News March 3, 2026
అన్నమయ్య: యూట్యూబ్ చూసి బైక్‌ల చోరీలు..

పీలేరు మండలం పొంతలచెరువు క్రాస్ వద్ద వాహనాల తనిఖీలలో పోలీసులు నలుగురు అంతర్ జిల్లా బైక్ దొంగలను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి అన్నమయ్య, చిత్తూరు, కడప, తిరుపతి జిల్లాల్లో చోరీ చేసిన రూ.40 లక్షల విలువైన 24 బైకులను స్వాధీనం చేసుకున్నారు. యూట్యూబ్ వీడియోలు చూసి చోరీలకు పాల్పడినట్లు నిందితులు ఒప్పుకున్నారని తెలిపారు. వాహనాలు రికవరీ చేసిన సిబ్బందిని అన్నమయ్య జిల్లా SP ధీరజ్ కునుబిల్లీ అభినందించారు.
News March 3, 2026
మంగళగిరిలో హనుమాన్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం

వన్యప్రాణి సంహారాన్ని నివారించి, కో-లివింగ్ వైపు మలచడమే హనుమాన్ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. మంగళవారం మంగళగిరి 6వ బెటాలియన్‌లో ఈ ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు. వన్యప్రాణుల వల్ల పంట, ప్రాణ నష్టం జరగకుండా ఈ ప్రాజెక్టు దోహదపడుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 100 ప్రత్యేక వాహనాలను ప్రారంభించిన పవన్.. అటవీ శాఖ చరిత్రలో ఇది కీలక రోజని అభివర్ణించారు.
News March 3, 2026
ఆయనకు TTD ఛైర్మన్ పదవి ఎలా ఇచ్చారు: రోజా

టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడిపై మాజీ మంత్రి రోజా విమర్శలు చేశారు. ‘BR నాయుడిని టీటీడీ ఛైర్మన్‌గా నియమించిన దగ్గరి నుంచి తిరుమలలో ఎన్నో అపచారాలు జరిగాయి. జరుగుతూనే ఉన్నాయి. అయినా ఆయనపై చర్యలు లేవు. బీఆర్ నాయుడు గురించి మీకు ముందే తెలిసి కూడా ఆయనకు ఛైర్మన్ పదవి ఎలా ఇచ్చారు చంద్రబాబు గారూ?’ అంటూ రోజా ట్వీట్ చేశారు.


