News December 28, 2025
బాపట్ల జిల్లా పోలీస్ చరిత్రలో సువర్ణ అధ్యాయం

బాపట్ల జిల్లా ఆవిర్భావం తర్వాత 2022 డిసెంబర్ 28న తొలిసారిగా అప్పటి SP వకుల్ జిందాల్ వార్షిక నేర నివేదికను ప్రజలముందు ఉంచారు. జిల్లా ఏర్పడి 9 నెలలే అయినప్పటికీ, ప్రధానంగా నేరస్థులకు శిక్షలు వేయించే ‘కన్విక్షన్స్’ విషయంలో బాపట్ల జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడం విశేషం. ఆ ఏడాది ఏకంగా 1,341 కేసుల్లో నేరస్థులకు శిక్షలు ఖరారయ్యాయని, కొత్త జిల్లాలో శాంతిభద్రతల అమలుకు నిదర్శనమన్నారు.
Similar News
News December 29, 2025
4G బుల్లెట్ సూపర్ నేపియర్ గడ్డి ప్రత్యేకతలివే..

4G బుల్లెట్ సూపర్ నేపియర్ పశుగ్రాసంలో దీనిలో తీపిదనం ఎక్కువ. దీని కాండం ముదిరినా లోపల డొల్లగా ఉండటం వల్ల పశువులు సులువుగా, ఇష్టంగా తింటాయి. ఎకరం గడ్డి 10 ఆవులకు సరిపోతుంది. దీనిలో ప్రొటీన్ కంటెంట్ 16-18 శాతంగా ఉంటుంది. ఫైబర్ కూడా ఎక్కువ. దీని వల్ల పశువుల్లో పాల ఉత్పత్తి మరింత పెరుగుతుంది. ఈ గడ్డి చాలా గుబురుగా, దీని ఆకులు మృదువుగా ఉండటం వల్ల రైతులు కోయడం కూడా సులభం.
News December 29, 2025
కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి మండిపల్లి..!

అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని మార్చడం దాదాపు ఖరారైంది. ఇదే అంశంపై క్యాబినెట్ సమావేశంలో చర్చ జరిగింది. ఈక్రమంలో మంత్రి మండిపల్లి కన్నీటి పర్యంతం కాగా.. ఆయనను సీఎం చంద్రబాబు ఓదార్చరని సమాచారం. రాయచోటి అభివృద్ధిని తాను చూసుకుంటానని హామీ ఇచ్చారు. మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు, పుంగనూరు, రాయచోటితో అన్నమయ్య జిల్లా ఉంటుంది. జిల్లా కేంద్రం మదనపల్లె అవుతుందని సమాచారం.
News December 29, 2025
ఆరావళి కొండల నిర్వచనంపై సుప్రీంకోర్టు స్టే!

ఆరావళి కొండల కొత్త నిర్వచనంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీనివల్ల పర్యావరణానికి ముప్పు కలుగుతుందన్న ఆందోళనల నేపథ్యంలో పాత ఉత్తర్వులను ప్రస్తుతానికి నిలిపివేసింది. ఈ అంశాన్ని పరిశీలించేందుకు ఒక స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ బెంచ్ తెలిపింది. తదుపరి విచారణను జనవరి 21కి వాయిదా వేస్తూ అప్పటివరకు మైనింగ్ పనులు ఆపాలని రాష్ట్రాలకు నోటీసులు ఇచ్చింది.


