News February 9, 2025

బాపట్ల జిల్లా ప్రజలు జాగ్రత్త..!

image

బాపట్ల జిల్లాలో వాతావరణం మారుతోంది. వారంక్రితం వరకు జిల్లాను చలి వణికించింది. తాజాగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఫిబ్రవరి తొలివారంలోనే మే నెలను తలపించేలా ఎండ కాస్తోంది. ఉదయం 10గంటల నుంచే సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. నిన్న బాపట్ల జిల్లాలో గరిష్ఠంగా 33.2డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రజలు బయటకు వెళ్లినప్పుడు జాగ్రత్తలు పాటించాలని ఎక్కువగా నీరు, కొబ్బరి నీళ్లు తాగాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

Similar News

News February 10, 2025

అగాఖాన్ అంత్యక్రియలు పూర్తి

image

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఇస్మాయిలీ ముస్లింల 49వ ఇమామ్ అగాఖాన్(88) అంత్యక్రియలు ముగిశాయి. ఈనెల 5న మరణించిన ఆయనను ఈజిప్ట్‌లోని అస్వాన్‌లో నిన్న రాత్రి ఖననం చేశారు. ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరైన ఆయన 1967లో అగాఖాన్ డెవలప్‌మెంట్ నెట్‌వర్క్‌ను స్థాపించారు. దీని ద్వారా వందలాది ఆసుపత్రులు, పాఠశాలలు, పేదలకు ఇళ్లు నిర్మించారు. ఆయన సేవలకుగానూ 2015లో కేంద్రం పద్మవిభూషణ్‌తో సత్కరించింది.

News February 10, 2025

భద్రాద్రి: 50 ఏళ్లుగా మోటారు లేకున్నా నీటి సదుపాయం

image

భద్రాద్రి జిల్లా గుండాల మండలం మామకన్ను గ్రామంలో వేసిన బోరులో భగీరథుడే ఉన్నట్లు నీళ్లు పైకి ఉబికి వస్తున్నాయి. ఊరిలో నీళ్ల కరవుందని 50 ఏళ్ల కింద బోరు వేశారు.. మోటారు బిగిద్దామనుకుంటే నీళ్లు ఆగడం లేదని స్థానికులు చెబుతున్నారు. తమ తాతల కాలం నుంచి నీళ్లు పైకి వస్తున్నాయని అంటున్నారు. పక్కనే ఉన్న ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఈ నీళ్లనే వాడుకుంటున్నారు.

News February 10, 2025

ఓవరాల్ ఛాంపియన్ షిప్ అనంత జిల్లా

image

నగరంలోని పీటీసీ నందు ఈనెల 7వ తేదీ నుంచి 9వ జరిగిన మాస్టర్ అథ్లెటిక్స్ రాష్ట్రస్థాయి పోటీల్లో అనంతపురం జిల్లా క్రీడాకారులు ఓవరాల్ ఛాంపియన్షిప్ గెలుచుకుంది. ఈ ట్రోఫీను మా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీపతి, జిల్లా అధ్యక్షుడు సుధాకర్ బాబు, సెక్రటరీ సికిందర్, చేతుల మీదుగా అందజేశారు. ఈ క్రీడా పోటీల్లో 30 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల వయస్సు ఉన్న పురుషులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

error: Content is protected !!