News January 24, 2026
బాపట్ల జిల్లా ప్రయాణికులకు గుడ్ న్యూస్.!

ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన తిరువనంతపురం–చర్లపల్లి <<18930504>>అమృత్ భారత్<<>> ప్రత్యేక రైలు శనివారం బాపట్ల స్టేషన్‌కు రానుంది. ఉదయం 10.20 గంటలకు గుంటూరు, అనంతరం బాపట్లకు రానుంది. ఈ మార్గంలో సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైలుకు గుంటూరు స్టేషన్‌లో ఘన స్వాగతం పలకాలని రైల్వే వినియోగదారుల సంఘాలు నిర్ణయించాయి. ప్రయాణికులకు కొత్త కనెక్టివిటీ అందనుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News February 3, 2026
దీపారాధన చేయాలంటే స్త్రీలు తల స్నానం చేయాలా?

వివాహితలు నిత్య దీపారాధనకై రోజూ తలస్నానం చేయాల్సిన అవసరం లేదు. పాపటలో కుంకుమ ధరిస్తే తలస్నానం చేసినంత ఫలితం దక్కుతుంది. స్త్రీల పాపటలో గంగాదేవి ఉంటుందని, అక్కడ కుంకుమ ధరిస్తే పవిత్రతను ఇస్తుందని నమ్మకం. అయితే వ్రతాలు, పూజలు, దీక్షల సమయంలో మాత్రం తప్పనిసరిగా తలస్నానం చేయాలి. అలాగే దీపారాధన చేస్తే ఎవరికీ ఎంగిలి పదార్థాలు పెట్టకూడదు. అలా చేస్తే ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయని శాస్త్రం చెబుతోంది.
News February 3, 2026
TTD లడ్డూ నెయ్యి కల్తీ వెనుక ఎవరున్నారో తేలుద్దాం: క్యాబినెట్లో చర్చ

AP: TTD నెయ్యి కల్తీలో తెర వెనుక ఎవరున్నారో తేల్చాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఇవాళ జరిగిన క్యాబినెట్ భేటీలో సిట్ ఛార్జ్‌షీట్‌పై మంత్రులు చర్చించారు. కల్తీ నెయ్యి ఎక్కడ తయారైంది? దాన్ని ఎలా గుర్తించారు? దీనిలో భాగస్వాములెవరు? ఇలా విచారణలో వెలుగు చూసిన వాస్తవాలన్నిటినీ ప్రజలకు వివరించాల్సిన అవసరముందని మంత్రులు అభిప్రాయపడ్డారు. SCకి సిట్ అందించిన నివేదిక బహిర్గతం అయ్యాక మరోసారి చర్చించనున్నారు.
News February 3, 2026
గద్వాల జిల్లాలో 285 క్యాన్సర్ కేసులు నమోదు

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా గద్వాల జిల్లా ఆసుపత్రిలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంకట్ దాస్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు 285 క్యాన్సర్ కేసులు నమోదు కాగా, 131 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. డే కేర్ సెంటర్ ద్వారా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.


