News February 23, 2025

బాపట్ల జిల్లా విద్యుత్ వినియోగదారులకు గమనిక

image

కరెంట్ బిల్లు చెల్లించుటకు బాపట్ల జిల్లాలోని అన్ని విద్యుత్ రెవెన్యూ కేంద్రాలలోని కౌంటర్లు ఆదివారం తెరిచే ఉంటాయని, బాపట్ల విద్యుత్ శాఖ సూపరింటెండ్ ఇంజినీర్ ఆంజనేయులు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ విషయాన్ని విద్యుత్ వినియోగదారులు గమనించి, ఇప్పటివరకు విద్యుత్ బిల్లులు చెల్లించనివారు ఆదివారం బిల్లులను చెల్లించాలని కోరారు.

Similar News

News February 23, 2025

విద్యుత్ కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడిగా అశోక్ ఎన్నిక

image

విద్యుత్ కార్మిక సంఘం మెదక్ జిల్లా నూతన గౌరవ అధ్యక్షుడిగా అశోక్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జిల్లా సెక్రటరీ ఓరం సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ.. తనను గౌరవాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు రాష్ట్ర నాయకత్వం, కంపెనీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. విద్యుత్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.

News February 23, 2025

BREAKING: గ్రూప్-2 ‘ఇనిషియల్ కీ’ విడుదల

image

AP: ఇవాళ నిర్వహించిన గ్రూప్-2 మెయిన్స్ ‘ఇనిషియల్ కీ’ని APPSC విడుదల చేసింది. https://portal-psc.ap.gov.inలో కీ చూసుకోవచ్చు. అభ్యర్థులకు ప్రశ్నలు, కీపై సందేహాలు ఉంటే ఏపీపీఎస్సీ సైట్ ద్వారా ఈ నెల 25 నుంచి 27 వరకు అభ్యంతరాలు తెలపవచ్చని పేర్కొంది. పోస్ట్, ఫోన్, SMS, వాట్సాప్ ద్వారా అభ్యంతరాలు స్వీకరించబోమని స్పష్టం చేసింది. కీ కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News February 23, 2025

ఆ సమయంలో డిప్రెషన్‌కు లోనయ్యా: ఆమిర్ ఖాన్

image

లాల్‌సింగ్ చడ్ఢా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావటం తనను ఎంతో బాధించిందని ఆమీర్ ఖాన్ అన్నారు. కొంతకాలం పాటు డిప్రెషన్‌కు లోనైనట్లు తెలిపారు. తన చిత్రాలు సరిగ్గా ఆడకపోతే రెండు, మూడు వారాలు డిప్రెషన్‌లో ఉంటానని అనంతరం సినిమా ఫెయిల్యూర్‌కు కారణాలు టీంతో కలిసి చర్చిస్తానని ఆమిర్ పేర్కొన్నారు. 2022లో ఒక హాలీవుడ్ చిత్రానికి రీమేక్‌గా వచ్చిన లాల్‌సింగ్ చడ్ఢా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.

error: Content is protected !!