News February 23, 2025
బాపట్ల జిల్లా విద్యుత్ వినియోగదారులకు గమనిక

కరెంట్ బిల్లు చెల్లించుటకు బాపట్ల జిల్లాలోని అన్ని విద్యుత్ రెవెన్యూ కేంద్రాలలోని కౌంటర్లు ఆదివారం తెరిచే ఉంటాయని, బాపట్ల విద్యుత్ శాఖ సూపరింటెండ్ ఇంజినీర్ ఆంజనేయులు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ విషయాన్ని విద్యుత్ వినియోగదారులు గమనించి, ఇప్పటివరకు విద్యుత్ బిల్లులు చెల్లించనివారు నేడు బిల్లులను చెల్లించాలని కోరారు.
Similar News
News February 23, 2025
‘భారత్ ఓడిపోతుంది’ అన్న ఐఐటీ బాబా ఎక్కడ?

పాక్ చేతిలో భారత్ ఓడిపోతుందని <<15548119>>జోస్యం చెప్పిన<<>> ఐఐటీ బాబా అలియాస్ అభయ్ సింగ్‌పై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. Xలో #IITianBaba ట్రెండ్ అవుతోంది. ‘విరాట్.. ఇంకా చాలా మంది ఉన్నప్పటికీ ఎలా గెలుస్తారో చూద్దాం. అది జరిగి తీరదు’ అని నిన్న ఐఐటీ బాబా అనడంపై ఫైరవుతున్నారు. ‘ఇప్పుడు నీ జోస్యం ఏమైంది?’ అని నిలదీస్తున్నారు. వైరల్ అయ్యేందుకు సొంత దేశం ఓడిపోవాలని కోరుకోవడమేంటని మండిపడుతున్నారు.
News February 23, 2025
ఉపాధ్యాయుల సమస్యలపై సీఎంకు విజ్ఞప్తి

దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామోదర్ రెడ్డి కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఎం సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ రాష్ట్ర పూర్వపు ప్రధాన కార్యదర్శి గుండు లక్ష్మణ్,మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి ,తదితరులు పాల్గొన్నారు.
News February 23, 2025
ఇది అత్యంత దారుణం: YS జగన్

AP: గ్రూప్-2 అభ్యర్థులకు న్యాయం చేస్తున్నట్టు నమ్మబలికి చివరకు నట్టేటా ముంచారని CM చంద్రబాబును YS జగన్ విమర్శించారు. ‘అభ్యర్థుల సమస్యలకు పరిష్కారం చూపిస్తానని పరీక్షకు 2 రోజులముందు విద్యాశాఖ మంత్రి మోసపూరిత ప్రకటన చేశారు. ప్రభుత్వం లేఖ ఇచ్చినా APPSC ముందుకు వెళ్తోందని CM వాయిస్‌తో ఆడియో లీక్ చేయించి డ్రామా చేశారు. అయోమయం, అస్పష్టత మధ్యే పరీక్షలు నిర్వహించడం అత్యంత దారుణం’ అని <