News March 17, 2025

బాపట్ల జిల్లా TO DAY TOP HEADLINES

image

★బాపట్ల జిల్లా వ్యాప్తంగా 234 మంది విద్యార్థులు గైర్హాజరు★పిట్టలవానిపాలెం: సైనికుడి కుటుంబానికి 1.25 లక్షల సాయం★భట్టిప్రోలు: చేనేతకు రూ.2 వేల కోట్లు కేటాయించాలి★బాపట్ల: ఎన్టీఆర్ సేవా మిత్రల నిరసన★బాపట్ల: సారా నిర్మూలనకు నవోదయం 2.0 ప్రారంభం★బాపట్ల: వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది నిరసన★పర్చూరు: Way2Newsతో టెన్త్ విద్యార్థులు★బాపట్ల: రైలు కిందపడి గుర్తుతెలియని మహిళ ఆత్మహత్య

Similar News

News March 18, 2025

నల్గొండ: ప్రతి గ్రామానికి ఒక పోలీస్ అధికారి: SP

image

జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి, ప్రజా సమస్యల తక్షణ పరిష్కారానికి ప్రతి గ్రామానికి ఒక పోలీస్ అధికారిని నియమిస్తున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. సోమవారం పోలీస్ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ప్రతి గ్రామంలో వీపీవో క్రమం తప్పకుండా సందర్శించి, ఆయా గ్రామాల్లో ఉన్న సమస్యల పరిష్కార దిశగా కృషి చేయాలని సూచించారు.

News March 18, 2025

సిద్దిపేట: కుష్టు రహిత సమాజాన్ని నిర్మిద్దాం: DMHO

image

కుష్టు రహిత సమాజాన్ని నిర్మిద్దామని డీఎంహెచ్ఓ పల్వాన్ కుమార్ అన్నారు. జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ అరుణ్ కుమార్ అధ్యక్షతన జాతీయ కుష్టు నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కుష్టు రహిత సమాజాన్ని నిర్మించేందుకు జిల్లాలో మార్చి 17 నుంచి 30 వరకు క్షేత్రస్థాయిలో ఆశా కార్యకర్తల ద్వారా ఇంటింటికి వెళ్లి కుష్టు వ్యాధి లక్షణాలున్న వారిని ముందస్తుగా గుర్తించి వైద్యం అందించనున్నట్లు తెలిపారు.

News March 18, 2025

ADB: పోలీసులను బెదిరించిన మహిళపై కేసు: CI

image

మట్కా జూదం నిర్వహిస్తున్న మహిళాగ్యాంగ్‌ను ఆదిలాబాద్ టూటౌన్ పోలీసులు స్థానిక ఇంద్రానగర్‌లో అరెస్టు చేశారు. అరెస్టు చేసే క్రమంలో ఫర్జానా సుల్తానా అనే మహిళ పోలీస్ స్టేషన్‌కు రానని.. తనను స్టేషన్కు తీసుకెళ్తే గొంతు కోసుకుంటానంటూ పోలీసులను బెదిరించింది. బ్లేడుతో గొంతు కోసుకోవడానికి ప్రయత్నించి భయపెట్టించింది. దీంతో ఆమెపై మట్కా కేస్‌తోపాటు బెదిరించినందుకు మరో కేసును నమోదు చేసినట్లు CI కరుణాకర్ తెలిపారు.

error: Content is protected !!