News March 24, 2025
బాపట్ల జిల్లా TODAY TOP HEADLINES

◆ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలి: బాపట్ల కలెక్టర్◆క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు: బాపట్ల ఎస్పీ◆బాపట్ల: పోలీస్ గ్రీవెన్స్ కు 48 ఫిర్యాదులు◆దక్షిణ మధ్య రైల్వే అధికారులతో బాపట్ల ఎంపీ సమీక్ష◆బాపట్ల: భార్యను చంపిన కేసులో భర్తకు జీవిత ఖైదు◆వేటపాలెం: టీడీపీలో చేరిన కాంగ్రెస్ కుటుంబాలు
Similar News
News July 5, 2025
తునిలో రైలు ఢీకొని వ్యక్తి మృతి

తుని రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రైన్ ఢీ కొట్టడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు. శనివారం ఉదయం తుని రైల్వే స్టేషన్ 1వ ప్లాట్‌ఫాం చివర తెల్లవారుజామున రైలు పట్టాలు దాటుతుండగా గుర్తు తెలియని వ్యక్తిని రైలు ఢీ కొట్టడంతో మృతి చెందాడు. అతడి వయసు సుమారు 45 ఉంటుందన్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉందన్నారు.
News July 5, 2025
వరంగల్: మళ్లీ సెప్టెంబర్‌లోనే బియ్యం!

రాష్ట్ర వ్యాప్తంగా మూడు నెలల సన్న బియ్యం పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 11,25,355 ఉండగా 9,66,526 మంది కార్డు దారులు మాత్రమే బియ్యం తీసుకున్నారు. ఇంకా 1,58,829 మంది తీసుకోలేదు. జూన్, జులై, ఆగస్టుకు సంబంధించిన బియ్యం గతనెల 1 నుంచి 30 వరకు పంపిణీ చేశారు. తిరిగి సెప్టెంబర్‌లో పంపిణీ చేయనున్నారు. మీరు బియ్యం తీసుకున్నారా? కామెంట్ చేయండి.
News July 5, 2025
JGTL: ఫ్రెండ్స్ అవమానించారని విద్యార్థిని సూసైడ్

జగిత్యాల జిల్లా జాబితాపూర్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కాటిపెల్లి నిత్య(21) HYD KPHB కాలనీలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ B.TECH థర్డ్ ఇయర్ చదువుతోంది. ఈ క్రమంలో చదువులో వెనుకబడ్డావంటూ ఇద్దరు స్నేహితులు నిత్యను అవమానించారు. రెండ్రోజుల క్రితం ఇంటికి వెళ్లిన నిత్య గడ్డి మందు తాగింది. కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందింది. కేసు నమోదైంది.