News March 27, 2025
బాపట్ల జిల్లా TODAY TOP NEWS

◆బాపట్ల జిల్లాలో యువ రైతు ఆత్మహత్య
◆రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారు: MLA నరేంద్ర
◆ప్రజల్ని మభ్యపెడుతున్న కూటమి: వరికూటి అశోక్
◆పర్చూరు: సులువు కానున్న తెలంగాణ- ఆంధ్ర రవాణా
◆మార్టూరు: ‘మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఎక్కడ’
◆చివరి ఎకరా వరకు నీరు అందాలి: MLA నక్కా
◆బల్లికురవ: ‘వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి’
◆బాపట్ల మెడికల్ కాలేజీ నిర్మాణంలో నిర్లక్ష్యం: కోన
Similar News
News July 6, 2025
జగిత్యాల: విద్య, వైద్యంపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి

జగిత్యాల జిల్లాలో విద్య, వైద్యంపై కలెక్టర్ సత్యప్రసాద్ ప్రత్యేక దృష్టి సారించారు. తరచూ ఆయన ప్రభుత్వ పాఠశాలలను, ప్రభుత్వ ఆసుపత్రులను తనిఖీ చేస్తున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనాన్ని అందించాలని సిబ్బందికి సూచిస్తున్నారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రులను తనిఖీ చేస్తూ వైద్యులు సమయపాలన పాటించాలని, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, అందుబాటులో మందులు ఉంచుకోవాలని చెబుతూ అప్రమత్తం చేస్తున్నారు.
News July 6, 2025
పాశమైలారం: 43కు చేరిన మృతుల సంఖ్య

పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య ఆదివారానికి 43కి చేరింది. డీఎన్ఏ టెస్టుల ద్వారా మృతులకు పరీక్షలు నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు. పరిశ్రమ వద్ద ఏడో రోజు కూడా సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. తమ వాళ్ల మృతదేహాలను ఎప్పుడు అప్పగిస్తారని కుటుంబసభ్యులు ఆసుపత్రుల వద్ద ఎదురుచూస్తున్నారు.
News July 6, 2025
రాజాపూర్: గొంతులో పూరి ఇరుక్కుని యువకుడి మృతి

జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఖానాపూర్‌కు చెందిన బ్యాగరి కిరణ్ కుమార్ (25) వ్యవసాయ పొలంలో పూరీలు తింటుండగా గొంతులో ఇరుక్కొనడం వల్ల ఊపిరాడక మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.