News February 4, 2025
బాపట్ల: నందిగం సురేశ్‌కు ధైర్యం చెప్పిన జగన్
విదేశీ పర్యటన ముగించుకొని మాజీ సీఎం జగన్ తాడేపల్లి నివాసానికి సోమవారం రాత్రి చేరుకున్నారు. దీంతో ఆయనను వైసీపీ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా జగన్ బాపట్ల మాజీ ఎంపీ నందింగం సురేశ్‌ను ఆప్యాయంగా పలకరించి యోగ క్షేమాలను తెలుసుకున్నారు. అక్రమ కేసులను చట్టపరంగా ఎదుర్కొందామని ధైర్యం చెప్పినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కార్యక్రమంలో అంబటి, పేర్నినాని, వెల్లంపల్లి తదితరులు పాల్గొన్నారు.
Similar News
News February 4, 2025
అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. విపక్ష పార్టీల ఎమ్మెల్యేలు వేర్వేరుగా భేటీ
TG: అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నేపథ్యంలో బీఆర్ఎస్‌ఎల్పీ, బీజేపీఎల్పీ ఎమ్మెల్యేలు వేర్వేరుగా సమావేశమయ్యారు. సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై వారు చర్చిస్తున్నారు. మరోవైపు బీసీ రిజర్వేషన్ల పెంపుపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. ముస్లిం రిజర్వేషన్లు 4 శాతం ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ధి కోసమే కులగణన చేసిందని దుయ్యబట్టారు.
News February 4, 2025
MBNR: రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య
పెళ్లి కావట్లేదనే మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిన్న జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జిల్లా కేంద్రంలోని వేపూరిగేరికి చెందిన శ్రీనివాసులు(39) తండ్రి చిన్నతనంలోనే చనిపోగా, తల్లి అనారోగ్యంతో ఇంట్లో ఉంది. దీంతో ఒంటిరిగా జీవిస్తున్నట్లు భావించాడు. దీనికి తోడు పెళ్లికాకపోతుండటంతో తీవ్ర మనస్తాపానికి గురై టీడీగుట్ట రైల్వేగేట్ దగ్గర రైలు కిందపడ్డాడు. ఈ మేరకు కేసు నమోదైంది.
News February 4, 2025
గుండుమాల్: చిరుత పులి దాడిలో లేగ దూడ మృతి
గుండుమాల్ మండల పరిధిలో సోమవారం రాత్రి గుండుమాల్ గ్రామానికి చెందిన గుడిసె కుర్మయ్య పొలం దగ్గర చిరుత పులి దాడి చేయడంతో లేగ దూడ మృతి చెందింది. గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు రైతులు తెలిపారు. అధికారులు స్పందించి రైతు కుర్మయ్యకు న్యాయం చేయడంతో పాటు చిరుతను బంధించి తమను ఆదుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. కొత్తపల్లి మండలంలో మరో చిరుతను అటవీశాఖ అధికారులు గుర్తించారు.