News March 25, 2025
బాపట్ల: ‘నా కొడుకు చంపాలని చూస్తున్నాడు’

ఆస్తిరాయించుకొని తన కొడుకు తనను చంపాలనుకుంటున్నాడని సయ్యద్ కరిమూన్, బొప్పుడి బాపట్ల SP వద్ద వాపోయారు. ‘నాకు ఇద్దరు మగపిల్లలు, ఒకమ్మాయి. పెద్ద కొడుకు చనిపోయాడు. నా చిన్నకొడుకు సయ్యద్ మోహిద్దీన్, కోడలు నజీమూన్‌లు ఆస్తీ మొత్తం తీసుకుని నన్ను, నా భర్తను చంపాలని చూశారు. దీంతో నాభర్త భయంతో పారిపోయాడు. నేను ప్రాణభయంతో వేటపాలెంలోని నా కూతరు వద్ద ఉన్నా, నన్ను కాపాడండి’ అని వేడుకున్నారు.
Similar News
News March 28, 2025
సంగారెడ్డి: పదో తరగతి సైన్స్ పరీక్షకు 99.82% హాజరు

సంగారెడ్డి జిల్లాలోని 122 పరీక్ష కేంద్రాల్లో శుక్రవారం జరిగిన భౌతిక శాస్త్రం పదో తరగతి పబ్లిక్ పరీక్షకు 99.82% విద్యార్థులు హాజరయ్యారని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. 22,411 మంది విద్యార్థులకు గానూ 22,370 మంది విద్యార్థులు హాజరయ్యారని, 41 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.
News March 28, 2025
HYDలో తగ్గిన ఇళ్ల కొనుగోళ్లు: KTR

హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో HYDలో ఇళ్ల కొనుగోళ్లు తగ్గాయని KTR Xలో ఆరోపించారు. పేదల ఇళ్లమీదకు బుల్డోజర్‌లు పంపి పెద్దలతో సెటిల్‌మెంట్లు చేసుకుంటున్నారని పేర్కొన్నారు.‘గత త్రైమాసికంలో 49% ఇళ్ల విక్రయాలు తగ్గాయి. ఆఫీస్‌ల లీజింగ్ కూడా పాతాళానికి పడిపోయింది. ఈ ఏడాది 3 నెలల్లో కొనుగోళ్లు 41% తగ్గాయి. ప్రభుత్వం అబద్ధాలు మాని అభివృద్ధి చేయాలి, కూల్చడం కాదు, కట్టడం నేర్చుకోవాలి’ అని రాసుకొచ్చారు.
News March 28, 2025
వేడికి ఆగలేం.. కానీ చెట్లను బతకనీయం!

వేసవి వేడి మొదలైంది. బయటితో పోలిస్తే చెట్టు నీడలో ఉష్ణోగ్రత సగటున కనీసం 2 డిగ్రీలు తక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కానీ పల్లెటూళ్లలో సైతం ఇంటి ముందు ఖాళీ ఉంటే సిమెంట్‌తో అలికేస్తున్నాం తప్పితే చెట్లను ఎంతమంది పెంచుతున్నాం? ఆకులు రాలతాయనో, వేర్లు ఇంటిని కూల్చేస్తాయనో చాలామందిలో ఆందోళన. కనీసం ఖాళీ స్థలాల్లోనైనా వీలైనన్ని చెట్లు నాటితే భూతాపాన్ని తగ్గించినవారిమవుతాం. వృక్షో రక్షతి రక్షిత: