News April 14, 2025

బాపట్ల: నేడు పీజీఆర్ఎస్ కార్యక్రమం రద్దు- కలెక్టర్

image

బాపట్ల జిల్లా కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం తాత్కాలికంగా రద్దు చేసినట్లు బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అంబేడ్కర్ జయంతి పురస్కరించుకొని పీజీఆర్ఎస్ కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. జిల్లాలోని ప్రజలు ఈ విషయాన్ని గమనించి అర్జీలు అందజేసేందుకు కలెక్టరేట్ కార్యాలయానికి రావద్దని సూచించారు.

Similar News

News July 4, 2025

అల్లూరి స్ఫూర్తితో ప్రజలకు సేవ చేద్దాం: ఇన్‌ఛార్జ్ కలెక్టర్

image

పోరాట యోధుడు, స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో ప్రజలకు సేవలు చేయాలని జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య సూచించారు. శుక్రవారం కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా యువజన సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అల్లూరి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సెట్కూరు సీఈవో వేణుగోపాల్, గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.

News July 4, 2025

మహనీయుల సేవలను స్మరించుకోవాలి: కలెక్టర్

image

మహనీయుల సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో
శుక్రవారం నిర్వహించిన అల్లూరి సీతారామరాజు జయంతి, పింగళి వెంకయ్య వర్ధంతి కార్యక్రమాలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి ఇరువురి మహనీయుల చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డీఆర్ఓ చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

News July 4, 2025

CUET(UG) ఫలితాలు విడుదల

image

కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్(అండర్ గ్రాడ్యుయేషన్)-2025 ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు ఇక్కడ <>క్లిక్<<>> చేసి రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. మే 13 నుంచి జూన్ 4 వరకు జరిగిన ఈ పరీక్షలకు 13లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు.