News December 29, 2025

బాపట్ల: పది పాసైనా ఉద్యోగం..!

image

జిల్లా కేంద్రంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు బాపట్ల కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ సోమవారం తెలిపారు. APSDC ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కాలేజీలో జాబ్ మేళా నిర్వహిస్తామన్నారు. 17 బహుళజాతి కంపెనీలు పాల్గొని 300ల ఉద్యోగాలను భర్తీ చేయనున్నాయన్నారు. విద్యార్హతను బట్టి జీతం రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు ఉంటుందన్నారు. పది ఆపై చదివినవారు అర్హులన్నారు.

Similar News

News February 21, 2026

మరో బాంబ్ పేల్చిన ట్రంప్.. 15 శాతానికి టారిఫ్స్

image

ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. గ్లోబల్ టారిఫ్స్‌ను 10 నుంచి 15 శాతానికి పెంచారు. దశాబ్దాలుగా USను పలు దేశాలు దోచుకున్నాయని పేర్కొన్నారు. రాబోయే కొద్ది నెలల్లో చట్టబద్ధంగా అనుమతించదగిన సుంకాలను నిర్ణయించి అమలు చేస్తామన్నారు. కాగా ప్రపంచ దేశాలపై టారిఫ్స్ వేసే హక్కు అధ్యక్షుడికి లేదని US సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంపై మండిపడిన ట్రంప్ కొద్ది గంటల కిందటే 10% టారిఫ్స్ విధించిన విషయం తెలిసిందే.

News February 21, 2026

సిరిసిల్ల: డిప్యూటీ సీఎం పర్యటన వాయిదా

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈనెల 22న జరగాల్సిన ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన వాయిదా పడింది. గంభీరావుపేట మండలంలో వివిధ అభివృద్ధి పనులకు ఆయన హాజరుకావాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల ప్రోగ్రాం రద్దయినట్లు డిప్యూటీ సీఎం ప్రైవేట్ సెక్రటరీ ప్రకటించారు. పర్యటనకు సంబంధించిన తదుపరి తేదీని త్వరలోనే వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.

News February 21, 2026

ఆదిలాబాద్ : ఉచిత శిక్షణకు దరఖాస్తుల గడువు రేపే

image

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగ డిగ్రీ అభ్యర్థులకు ఉచిత రెసిడెన్షియల్‌ శిక్షణ కోసం ఆన్‌లైన్‌ దరఖాస్తులకు ఆదివారం (రేపు) చివరి రోజని ఎస్సీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కె.రమేష్‌ తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వారికి మార్చి 1న ఆదిలాబాద్‌లోని నలంద డిగ్రీ కళాశాలలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు.