News February 14, 2025

బాపట్ల: ‘పరిశ్రమలకై ఔత్సాహికులను ప్రోత్సహించాలి’

image

పరిశ్రమల స్థాపన కొరకు ఔత్సాహికులను మరింత ప్రోత్సహించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. పరిశ్రమల ప్రోత్సాహక, అభివృద్ధిపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం జిల్లా సంయుక్త కలెక్టర్ అధ్యక్షతన స్థానిక కలెక్టరేట్‌లో గురువారం జరిగింది. బాపట్ల జిల్లాలోని వివిధ పరిశ్రమల నుంచి ఉత్పత్తి అవుతున్న వస్తువులను ఇతర ప్రాంతాలకు ఎగుమతి అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

Similar News

News February 14, 2025

ఒక్క డోర్ మాత్రమే తెరచి ఉండేలా చూడాలి: కలెక్టర్

image

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అనకాపల్లి జివిఎంసి ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రం, బ్యాలెట్ బాక్స్‌లను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్‌ను కలెక్టర్ విజయకృష్ణన్ గురువారం పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ కేంద్రాల్లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. స్ట్రాంగ్ రూమ్‌కు ఒక్క డోర్ మాత్రమే తెరచి ఉండేలా చూడాలన్నారు.

News February 14, 2025

NZB: ఒంటరి మహిళ మెడలోంచి గొలుసు అపహరణ

image

NZBలో ఒంటరిగా ఉన్న ఓ వృద్ధురాలి మెడలో నుంచి దుండగుడు బంగారు గొలుసును అపహరించుకు వెళ్లాడు. ఈ ఘటన గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. వీక్లీ మార్కెట్‌కు చెందిన విజయ ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. ఇదే అదునుగా భావించిన దుండగుడు ఇంట్లోకి ప్రవేశించి మహిళ మెడలో నుంచి మూడున్నర తులాల బంగారు గొలుసును లాక్కొని పారిపోయాడు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వన్ టౌన్ ఎస్ఐ మొగులయ్య తెలిపారు.

News February 14, 2025

గోదావరిఖని: ‘పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించాలి’

image

గోదావరిఖనిలో సింగరేణి సంస్థకు అనుబంధంగా పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని సింగరేణి C&MD బలరాంకు వినతి పత్రం ఇచ్చినట్లు ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు మద్దెల దినేశ్ తెలిపారు. సింగరేణి పాఠశాలలో CBSE సిలబస్ అప్‌గ్రేడ్ చేయాలని, ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి చేయాలని కోరారు. సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు హై పవర్ వేతనాలు ఇవ్వాలని పేర్కొన్నారు.

error: Content is protected !!