News February 21, 2025

బాపట్ల: ‘పరీక్షలను సజావుగా నిర్వహించాలి’ 

image

రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలను సజావుగా నిర్వహించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. గురువారం అమరావతి సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ, పి 4 సర్వే, ఎం.ఎస్.ఎం.ఇ సర్వే, వాట్సాప్ గవర్నెన్స్‌పై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో బాపట్ల జిల్లా వెంకట మురళీ పాల్గొన్నారు.

Similar News

News September 19, 2025

బాపట్ల: రాజస్థాన్‌లో మన జవాన్ మృతి

image

బాపట్ల(M) వెదుళ్ళపల్లి గ్రామానికి చెందిన జవాన్ మేడిబోయిన దుర్గారెడ్డి రాజస్థాన్‌లో మృతి చెందినట్లు రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు సాంబశివరావు తెలిపారు. శుక్రవారం సాయంత్రం రాజస్థాన్ నుంచి మృతదేహం అంబులెన్స్‌లో శనివారం స్వగ్రామానికి రానుందని చెప్పారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News September 19, 2025

22 నుంచి కడపలో డిగ్రీ కాలేజీల బంద్..!

image

ఫీజు బకాయిల విడుదల కోసం డిగ్రీ విద్యా సంస్థలు బంద్ చేయాలని వైవీయూ డిగ్రీ కాలేజీ ప్రైవేట్ మేనేజ్మెంట్ అసోసియేషన్ నిర్ణయించింది. అసోసియేషన్ కార్యదర్శి శ్రీను మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాల్లో ఫీజు రీయంబర్స్‌మెంట్‌పై చర్చ జరపాలన్నారు. ఫీజులు రాక కళాశాలలు నడిపేందుకు ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఈనెల 22 నుంచి బంద్ చేస్తామంటూ యూనివర్సిటీ రిజిస్ట్రార్ పద్మకు బంద్ నోటీసులు ఇచ్చారు.

News September 19, 2025

HYD: పూల వర్షం.. బతుకమ్మకు సరికొత్త అందం!

image

తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఈసారి అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. పర్యాటకశాఖ ఆధ్వర్యంలో భాగ్యనగర వీధులు పూల పండుగ శోభతో ముస్తాబవ్వనున్నాయి. తెలంగాణలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మ ఘనత చాటి చెప్పేలా బహుముఖ ప్రణాళికలు రూపొందాయి. ఊహకందని ఏర్పాట్లులతో ఈ వేడుకలు భాగ్యనగరానికి కొత్త ఉత్సాహాన్ని తీసుకురానున్నాయి.