News March 11, 2026

బాపట్ల: పోక్సో కేసులో నిందితుడికి జైలు శిక్ష

image

ఇంకొల్లు స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడికి ఒంగోలు పోక్సో కోర్టు 3 సంవత్సరాల జైలు శిక్ష, రూ.8 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. మహిళలు, చిన్నారులపై నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ హెచ్చరించారు. కేసు దర్యాప్తులో సాక్ష్యాలు సమర్పించి నిందితుడికి శిక్ష పడేలా చేసిన CI రమణయ్య, ఎస్సై జి.సురేశ్, పోలీసు బృందాన్ని SP అభినందించారు.

Similar News

News April 5, 2026

నెల్లూరు: ఇంటర్న్‌షిప్.. నెలకు రూ.15 వేలు

image

నెల్లూరు జిల్లాలో ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ ఫేజ్-3కు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఎంపికైన వారికి రూ.9వేలు, స్టైపెండ్, రూ.6వేలు గ్రాంట్, ఇంటర్న్‌షిప్ పూర్తయ్యాక సర్టిఫికెట్ అందజేస్తారు. 10వ తరగతి నుంచి పీజీ వరకు చదివి వయసు 18-25 ఏళ్ల లోపు ఉన్నవాళ్లు అర్హులు. ఏప్రిల్ 15వ తేదీ లోపు pminternship.mygov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

News April 5, 2026

‘కోల్‌కతా వరకు వస్తాం’.. పాక్ మంత్రి ప్రగల్భాలు

image

పాకిస్థాన్ ప్రగల్భాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఇటీవల భారత ఇళ్లలోకి చొరబడి దాడి చేస్తామని రెచ్చగొట్టే <<19562163>>వ్యాఖ్యలు<<>> చేసిన ఆ దేశ మంత్రి ఖవాజా.. తాజాగా మరోసారి నోరు పారేసుకున్నారు. భారత్‌తో మళ్లీ యుద్ధం వస్తే అది సరిహద్దులకే పరిమితం కాదని.. కోల్‌కతా వరకు వెళతామని చెప్పుకొచ్చారు. మరోవైపు ఆర్థిక ఇబ్బందులు, అప్పుల తిప్పలతో కొట్టుమిట్టాడుతున్న పాక్‌కు అంత సీన్ లేదని నెటిజన్లు మండిపడుతున్నారు.

News April 5, 2026

‘మైసా’ నుంచి రష్మిక లుక్

image

రష్మిక బర్త్ డే సందర్భంగా ఆమె లీడ్ రోల్‌ చేస్తున్న ‘మైసా’ మూవీ నుంచి మరో పోస్టర్ విడుదలైంది. ముఖం నిండా గాయాలతో సీరియస్‌గా ఉన్న నేషనల్ క్రష్ ఫొటో వైరలవుతోంది. రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది.