News September 15, 2025
బాపట్ల పోలీస్ పీజీఆర్ఎస్‌కు 54 అర్జీలు

బాపట్ల పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఎస్పీ ఉమామహేశ్వర్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 54 అర్జీలు అందినట్లు తెలిపారు. ఫిర్యాదులను చట్టపరిధిలో వేగంగా పరిష్కరించాలని ఎస్పీ సిబ్బందికి సూచించారు. ప్రతి సోమవారం నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రజలు స్వయంగా వచ్చి తమ సమస్యలను అర్జీల రూపంలో అందించవచ్చని వివరించారు.
Similar News
News September 16, 2025
సిరిసిల్లల: ఈ నెల16 నుంచి 18 వరకు క్రీడల పోటీలు

అండర్ 14, 17 బాల బాలికల క్రీడల పోటీలను సిరిసిల్ల రాజీవ్ నగర్‌లోని మినీ స్టేడియంలో నిర్వహిస్తామని SGF సెక్రటరీ నర్రా శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈనెల 16 నుంచి 18 వరకు క్రీడల పోటీలు నిర్వహిస్తామని వివరించారు. 16న అథ్లెటిక్స్ లో రన్నింగ్ ఈవెంట్స్, 17న అథ్లెటిక్స్ లో జంపింగ్, త్రోయింగ్ ఈవెంట్స్, ఈనెల 18న బాలికలకు కోకో పోటీలు నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు.
News September 16, 2025
కర్నూలు: సత్తా చాటిన కడప జట్లు

కర్నూలులో రెండు రోజుల పాటు 17వ రాష్ట్రస్థాయి మినీ సబ్ జూనియర్ హ్యాండ్ బాల్ పోటీలు జరిగాయి. బాలురు, బాలికల విభాగంలో కడప జట్టు మొదటి స్థానంలో నిలిచి డబుల్ క్రౌన్ సాధించింది. కర్నూలు బాలుర జట్టు మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించింది. విజేతలకు జిల్లా ఒలంపిక్ సంఘ అధ్యక్షుడు రామాంజనేయులు, ఏపీ హ్యాండ్ బాల్ సంఘ అధ్యక్షుడు శ్రీనివాసులు బహుమతులు అందజేశారు.
News September 16, 2025
భద్రాచలం: APలో కలిశాక ఆ 5 గ్రామాల పరిస్థితి దుర్భరం

AP-TG విభజన సమయంలో APలో కలిసిన 5 గ్రామాల ప్రజల జీవనం ఆగమ్యగోచరంగా మారింది. సరిహద్దుల్లో ఉన్న ఎటపాక, కన్నాయిగూడెం, పిచుకులపాడు, గుండాల, పురుషోత్తపట్నంలో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని గ్రామస్థులు వాపోతున్నారు. ఈ గ్రామాలు భద్రాచలానికి 9 KM, రంపచోడవరంనకు 130 KM దూరంలో ఉన్నాయి. దీంతో విద్యార్థుల చదువులు, అభివృద్ధి దుర్భరంగా తయారయ్యాయంటున్నారు. తమను తిరిగి భద్రాచలంలో చేర్చాలని కోరుతున్నారు.