News April 5, 2025

బాపట్ల: పోలీస్ శాఖలో నిఘా విభాగం విధులు కీలకం- ఎస్పీ

image

పోలీస్ శాఖలో నిఘా విభాగం విధులు కీలకమని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి చెప్పారు. శనివారం బాపట్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా నిఘా విభాగ పోలీస్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. నిబద్ధతతో విధులు నిర్వహిస్తూ ముందస్తు సమాచారాన్ని వేగవంతంగా సేకరించాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలు నేరాలు కట్టడం చేయటానికి ముందస్తు సమాచారం కీలకమన్నారు.

Similar News

News April 6, 2025

‘బేబీ’ ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా?

image

‘బేబీ’తో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన తెలుగు హీరోయిన్ వైష్ణవి చైతన్య తన ఇష్టాయిష్టాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
*ఫస్ట్ క్రష్: రామ్ పోతినేని
*తొలి రెమ్యూనరేషన్: రూ.3వేలు *ఇష్టమైన ఫుడ్: బిర్యానీ
*ఫేవరెట్ హీరోయిన్: అనుష్క, సాయిపల్లవి
*మరిచిపోలేని ప్రశంస: చిరంజీవి జయసుధతో నన్ను పోల్చడం
కాగా సిద్ధు జొన్నలగడ్డతో వైష్ణవి నటించిన ‘జాక్’ మూవీ ఈ నెల 10న థియేటర్లలో రిలీజ్ కానుంది.

News April 6, 2025

కొడంగల్‌లో విషాదం.. బాలుడి మృతి

image

కొడంగల్ మం.లో విషాదం నెలకొంది. ఎనికేపల్లిలో మణితేజ(9) తండ్రి బసంతప్పతో కలిసి ఎద్దులకు నీళ్లు పోసేందుకు నీటితొట్టి వద్దకు వెళ్లాడు. ఇదే సమయంలో గాలికి చెట్టుకొమ్మలు విరిగి కరెంటు తీగలపై పడ్డాయి. ఒక్కసారిగా కరెంటు వైరు మణితేజకు తగలడంతో విద్యుదాఘాతానికి గురై చనిపోయాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 6, 2025

పెద్దపల్లి జిల్లాలోని ఉష్ణోగ్రతలు ఇలా

image

పెద్దపల్లి జిల్లాలోని ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా అంతర్గం 39.8℃ నమోదు కాగా రామగుండం 38.8, మంథని 39.7, సుల్తానాబాద్ 39.6, పెద్దపల్లి 39.5, కాల్వ శ్రీరాంపూర్ 39.4, పాలకుర్తి 39.4, రామగిరి 39.3, ఓదెల 39.3, కమాన్పూర్ 39.2, జూలపల్లి 39.1, ముత్తారం 38.9, ఎలిగేడు 38.5, ధర్మారం 38.4℃ గా నమోదయ్యాయి. ఇక 10 దాటితే జిల్లాలో ఎండ తీవ్రత విపరీతంగా పెరుగుతుంది.

error: Content is protected !!