News December 29, 2025

బాపట్ల: ‘ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి’

image

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. సోమవారం బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలువురు ప్రజలు వారి సమస్యలను అర్జీలరూపంలో కలెక్టర్‌కు అందజేశారు. ఆ సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.

Similar News

News December 30, 2025

ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న చలి తీవ్రత

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చలి తీవ్రత కొనసాగుతోంది. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని ములకాలపల్లిలో అత్యల్పంగా 9.9℃ల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో ఈ ప్రాంతానికి వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని గుల్లకోటలో 10.4℃, కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని ఆసిఫ్‌ నగర్‌లో 10.7℃ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News December 30, 2025

మాజీ ఎమ్మెల్యే మృతి

image

AP: రైల్వేకోడూరు మాజీ ఎమ్మెల్యే గుంటి వెంకటేశ్వర ప్రసాద్ గుండెపోటుతో ఇవాళ మృతి చెందారు. అనారోగ్యంతో ఇటీవల తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబీకులు వెల్లడించారు. 1999లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిన ప్రసాద్.. 2004లో అదే పార్టీ నుంచి గెలుపొందారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు సంతాపం తెలిపారు.

News December 30, 2025

నెల్లూరు: ఆ ఘనత మనకే..!

image

గూడూరు, రాపూరు, సైదాపురం మండలాలను విలీనం చేయడం నెల్లూరు జిల్లాకు అనుకూలం. ఈ 3 మండలాల్లో అపారమైన ఖనిజ సంపద నెలకొని ఉంది. ప్రపంచంలో అత్యధికంగా మైకా(అభ్రకం ) గనులు ఉన్న జిల్లాగా నెల్లూరుకు ఉన్న పేరు మరలా వచ్చింది. దీంతోపాటు క్వార్ట్జ్, తెల్లరాయి, గ్రావెల్ ఎక్కువగా ఉన్న సైదాపురం, రాపూరు మనకు రావడంతో జిల్లాకు ఆదాయం చేకూరనుంది.