News February 5, 2026
బాపట్ల: ‘ప్రతి మహిళా విద్యావంతులుగా మారాలి’

మహిళలకు చదువు ఎంతో అవసరమని, ప్రతి మహిళ విద్యావంతులుగా మారాలని జిల్లా కలెక్టర్ డా. వి. వినోద్ కుమార్ అన్నారు. గురువారం ఉదయం బాపట్ల మండలం ఈతేరు గ్రామంలోని ఎంపీపీ పాఠశాలలో వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అక్షర ఆంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మహిళలు చదువుకోవడం వల్ల కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతుందని తెలిపారు.
Similar News
News February 6, 2026
దుబ్బాకకు బద్ద శత్రువు హరీశ్ రావే: ఎంపీ

దుబ్బాక అభివృద్ధికి ఒక్క రూపాయి రాకుండా అడ్డుపడింది హరీశ్ రావేనని ఎంపీ రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే 27 నెలల్లో 27 సార్లు నియోజకవర్గానికి రాలేదని విమర్శించారు. దుబ్బాక మున్సిపాలిటీలోని 20 వార్డుల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించి, పట్టణ అభివృద్ధికి సహకరించాలని ప్రజలను కోరారు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపు చారిత్రక అవసరమని పేర్కొన్నారు.
News February 6, 2026
HYD: భవనంపై నుంచి దూకి వివాహిత సూసైడ్

కూకట్‌పల్లిలోని సీబీసీఐడీ కాలనీలో అనిత(23) వివాహిత ఆఫీస్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, మనస్తాపంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అనితకు 2021లో బాచుపల్లి శ్రీనివాస్‌తో వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News February 6, 2026
MHBD: భార్యల గెలుపునకు భర్తల ఇంటింటి ప్రచారం

మహబూబాబాద్, కేసముద్రం, మరిపెడ, తొర్రూర్, డోర్నకల్‌లో ఛైర్ పర్సన్ పీఠాలు మహిళలకు కేటాయించారు.
మున్సిపల్ ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కేటాయించడంతో ఆసక్తికర దృశ్యాలు కనిపిస్తున్నాయి. గతంలో భర్తల కోసం భార్యలు ప్రచారం చేశారు. ఇప్పుడు భార్యల గెలుపు కోసం భర్తలు జెండాలు పట్టుకుని ఇంటింటికీ తిరుగుతున్నారు. అభ్యర్థుల భర్తలు ప్రచార బాధ్యతలను తీసుకోని ఓటర్లను ప్రసన్నం చేయనున్నారు.


