News March 18, 2025
బాపట్ల: బయోమెట్రిక్ ఆధారంగా సచివాలయ సిబ్బందికి జీతాలు

సచివాలయ సిబ్బంది బయో మెట్రిక్ ద్వారా హాజరు వేయడం లేదని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి తెలిపారు. సిబ్బంది అందరూ బయోమెట్రిక్ ద్వారా హాజరు నమోదు చేయాలన్నారు. హాజరు నమోదులో జిల్లా వెనుకబడి ఉందని ఆయన తెలిపారు. ఏప్రిల్ మాసము నుంచి జీతభత్యాలు బయోమెట్రిక్ హాజరు ఆధారంగా చెల్లిస్తామన్నారు. సచివాలయ సిబ్బంది తప్పనిసరిగా ఉదయం సాయంత్రం రెండు పూటలా బయోమెట్రిక్ ద్వారా హాజరు నమోదు చేయాలని ఆయన అన్నారు.
Similar News
News November 10, 2025
హైదరాబాద్‌ను దేశ రెండో రాజధానిగా ప్రకటించాలా?

దేశ రాజధాని ఢిల్లీలో విపరీతమైన వాయు కాలుష్యంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. గాలి పీల్చలేక వేల మంది అస్వస్థతకు గురవుతున్నారు. దీంతో హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధాని చేయాలని మరోసారి డిమాండ్లు వినిపిస్తున్నాయి. అక్కడ శుభ్రమైన గాలితో పాటు కనెక్టివిటీ బాగుంటుందని వివిధ రాష్ట్రాల నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీలోని పలు కేంద్ర కార్యాలయాలను హైదరాబాద్‌కు తరలించాలంటున్నారు. దీనిపై మీ కామెంట్?
News November 10, 2025
ఏడుపాయల అమ్మవారి సన్నిధిలో దీపోత్సవం

ఏడుపాయల వన దుర్గ మాత సన్నిధిలో కార్తీక సోమవారం పురస్కరించుకొని సాయంకాల ప్రదోషకాల వేళలో దీపాలంకరణ సేవ నిర్వహించారు. అర్చకులు పార్థీవ శర్మ ఆధ్వర్యంలో పూజల అనంతరం మంటపంలో అమ్మవారి ఆకారంలో దీపాలు వెలిగించారు. అనంతరం మంజీరాలో గంగాహారతి ఇచ్చారు. ఆకాశ దీపం వెలిగించారు. భక్తులు పాల్గొని అమ్మవారి నామస్మరణ మారుమ్రోగించారు.
News November 10, 2025
GNT: అనుచిత పోస్టులు.. హైదరాబాద్‌లో అరెస్ట్

ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రిపై అసభ్యకర పోస్టులు పెట్టిన తుపాకుల సతీష్ కుమార్‌ను పాత గుంటూరు పోలీసులు సాంకేతిక ఆధారాలతో గుర్తించి హైదరాబాద్‌లోని జీడిమెట్లలో అరెస్ట్ చేశారు. అతడిని రిమాండ్‌కు తరలించారు. ఎవరైనా సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ హెచ్చరించారు.


