News September 21, 2025
బాపట్ల: బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లపై కలెక్టర్ ఆరా

సూర్యలంక సముద్రతీరం వద్ద బీచ్ ఫెస్టివల్ నిర్వహణకు సిద్ధం చేస్తున్న ప్రణాళికలను కలెక్టర్ వెంకట మురళి పరిశీలించారు. ఆదివారం సముద్ర తీరం వద్ద చేపట్టిన ఏర్పాట్లను ఎమ్మెల్యే నరేంద్ర వర్మతో కలిసి పరిశీలించారు. సందర్శకులకు ఏర్పాటు చేస్తున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ నిబంధనలను అమలు చేయాలని సూచించారు.
Similar News
News September 21, 2025
అవాంఛనీయ ఘటనలు లేకుండా చూడాలి: కలెక్టర్

ఈ నెల 22 నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు ఇంద్రకీలాద్రిపై జరిగే దసరా ఉత్సవాలకు రాష్ట్రం నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటకల నుంచి కూడా భక్తులు భారీగా వస్తారని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ నేపథ్యంలో భక్తుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఆదేశించారు.
News September 21, 2025
జీవీఎంసీలో రేపు పీజీఆర్ఎస్ రద్దు

జీవీఎంసీలో ప్రతి సోమవారం నిర్వహించే పిజిఆర్ఎస్ కార్యక్రమాన్ని రేపు రద్దు చేస్తున్నట్లు కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. విశాఖలో రెండు రోజులపాటు ఈ గవర్నెన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. సీఎం చంద్రబాబునాయుడును ఆ సదస్సుకు హాజరవుతున్న నేపథ్యంలో అధికారులు అందుబాటులో ఉండరని పేర్కొన్నారు.
News September 21, 2025
ములుగు: సంప్రదాయ దుస్తులు.. గౌరమ్మ పోలికలు!

ములుగు జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఎంగిలిపూల బతుకమ్మను పేర్చిన ఆడబిడ్డలు బొడ్రాయి, ఆలయాల వద్ద ఆడిపాడుతున్నారు. చిన్నారులు, యువతులు, మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో సందడి చేస్తున్నారు. చిన్నారులను అందంగా అలంకరించిన తల్లిదండ్రులు ‘గౌరమ్మ పోలిక’ అంటూ సంబరపడుతున్నారు. బతుకమ్మ వేడుకల్లో తీరొక్క పూల బతుకమ్మలతో పాటు పట్టు చీరలు, ఆభరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.