News March 23, 2025

బాపట్ల: బీసీ కార్పొరేషన్ రుణాలకు గడువు పొడిగింపు 

image

బాపట్ల జిల్లాలోని స్వయం ఉపాధి రుణాల దరఖాస్తుల గడువు పొడిగించినట్లు బీసీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వరరావు తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ.. స్వయం ఉపాధి రుణాల దరఖాస్తుకు ఈనెల 10వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఇచ్చిన గడువును.. మరో మూడు రోజులు పాటు పొడిగించామన్నారు. ఈ నెల 25వ తేదీ వరకు అవకాశం కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

Similar News

News February 25, 2026

రష్యన్ అమ్మాయిలతో అఫైర్ నిజమే.. కానీ: బిల్‌గేట్స్

image

‘ఎప్‌స్టీన్‌ ఫైల్స్’లో తన పేరు రావడంపై గేట్స్ ఫౌండేషన్ సిబ్బందికి బిల్ గేట్స్ క్షమాపణలు చెప్పారు. లైంగిక నేరగాడు ఎప్‌స్టీన్‌ను కలిసి తాను పెద్ద తప్పు చేశానని.. దాని వల్ల ఇబ్బంది పడ్డ వారికి క్షమాపణలు చెబుతున్నానన్నారు. రష్యన్ అమ్మాయిలతో అఫైర్ ఉందని.. ఈ విషయాన్ని ఎప్‌స్టీన్ తెలుసుకున్న మాట నిజమేనని అంగీకరించారు. కానీ ఎప్‌స్టీన్ బాధితులతో సంబంధం లేదని.. తాను చట్టవిరుద్ధమైన పనులు చేయలేదన్నారు.

News February 25, 2026

KNR: ‘విద్యార్థులను పరీక్షలకు సంసిద్ధం చేయాలి’

image

వచ్చే నెల 14 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే ఆకాంక్షించారు. కొత్తపల్లి మండలం చింతకుంట జడ్పీ ఉన్నత పాఠశాలను ఆమె సందర్శించారు. విద్యార్థుల నమూనా పరీక్ష పత్రాలను పరిశీలించి, వెనుకబడిన సబ్జెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఉపాధ్యాయులు విద్యార్థులను పరీక్షలకు సంసిద్ధం చేయాలన్నారు.

News February 25, 2026

బ్రాహ్మణపల్లిలో షీ టీం అవగాహన సదస్సు

image

రామగుండం సీపీ ఆదేశాల మేరకు, షీ టీం ఇంచార్జి ఎస్ఐ లావణ్య ఆధ్వర్యంలో పెద్దపల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో వార్డ్ మెంబర్ల శిక్షణలో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళల భద్రత, సైబర్ మోసాలు, యాంటీ డ్రగ్స్ అంశాలపై వివరించారు. వేధింపులపై 6303923700కు, సైబర్ మోసాలపై 1930కు సమాచారం ఇవ్వాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 100కు డయల్ చేయాలన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.