News January 4, 2026

బాపట్ల: మృతి చెందిన బాలుడు హాస్టల్ విద్యార్థి..!

image

కొరిశపాడు మండలం పమిడిపాడులో చెక్ డ్యామ్ వద్ద ఆదివారం ఈతకు దిగి మృతి చెందిన బాలుడి వివరాలు లభ్యమయ్యాయి. స్థానికుల వివరాల మేరకు.. బాలుడు పిల్లి చిన్న బాబు రాచపూడిలోని ఓ హాస్టల్లో ఉంటున్నాడు. ఆదివారం కావడంతో ముగ్గురు విద్యార్థులు ఈతకు వచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ఆసుపత్రికి తరలించారు.

Similar News

News February 20, 2026

కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం

image

AP: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏక సభ్య కమిషన్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనికి కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ దినేశ్ కుమార్‌ను నియమించింది. ఈ కమిషన్ టీటీడీలో పరిపాలనా లోపాలు, టెండర్లపై సమగ్ర పరిశీలన చేయనుంది. 45 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిషన్‌ను ప్రభుత్వం ఆదేశించింది.

News February 20, 2026

ఖానాపూర్‌లో 10వ శతాబ్దపు విగ్రహాలు లభ్యం..!

image

ఖానాపూర్ మండలంలోని బీర్నంది – కొమ్ము తాండా మధ్య అటవీ ప్రాంతంలో క్రీ.శ.10వ శతాబ్దానికి చెందిన విగ్రహాలను గుర్తించినట్లు చరిత్ర పరిశోధకులు రాజ్ కుమార్ తెలిపారు. చాళుక్యుల శైలిలో ఉన్న ద్విభుజ గణపతి, రాతిపై మలచిన భక్తాంజనేయ స్వామి, అరుదైన నాగబంధం, అలంకరణ స్తంభం ఇక్కడ లభ్యమయ్యాయి. ఒకప్పుడు ఇక్కడ ‘భీమన్న గుడి’ ప్రాంగణం ఉండేదని ఆయన పేర్కొన్నారు. ఈ చారిత్రక సంపద స్థానికులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

News February 20, 2026

BREAKING.. పెద్దపల్లి: ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్

image

పెద్దపెల్లి జిల్లా మంథని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ దాడులు నిర్వహించింది. సబ్ రిజిస్ట్రార్ రాజేందర్ ప్రవేట్ డాక్యుమెంట్ రైటర్ రషీద్‌తో కలిసి పుట్టపాక గ్రామానికి చెందిన ఓ రైతు వద్ద లంచం డిమాండ్ చేయగా, ఏసీబీ డీఎస్పీ మధు ఆధ్వర్యంలో వారి ఇరువురిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పుట్టపాక గ్రామానికి చెందిన ఓ రైతు ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కోసం రూ.16,500 లంచం డిమాండ్ చేశారు.