News December 21, 2025
బాపట్ల: రాజశేఖర్ బాబు ప్రస్థానమిదే..!

బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్ BUDA సలగల రాజశేఖర్ బాబు తండ్రి బెంజిమెన్ బాపట్ల MPగా 1989లో ఎన్నికయ్యారు. రాజశేఖర్ BSP పార్టీ తరఫున 1998లో బాపట్ల MPగా పోటీ చేసి ఓటమి చెందారు. అనంతరం TDPలో చేరారు. గత ఐదేళ్లు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన చేసిన పోరాటాలు, పార్టీ పట్ల చూపిన విధేయతను అధిష్ఠానం గుర్తించింది. BUDA ఛైర్మన్‌గా ఉన్న ఆయనకు అధిష్ఠానం తాజాగా జిల్లా పార్టీ పగ్గాలను కట్టబెట్టింది.
Similar News
News December 21, 2025
షాకింగ్.. బిగ్‌బాస్ విన్నర్ ప్రకటన!

తెలుగు బిగ్‌బాస్ సీజన్-9 విజేత ఎవరనే విషయమై ఉత్కంఠ నెలకొంది. మరికాసేపట్లో విన్నర్ ఎవరో తెలియనుండగా ఆన్‌లైన్ ఎన్సైక్లోపీడియా వికీపీడియా ముందే విజేతను చెప్పేసింది. ఈ సీజన్ విన్నర్ కళ్యాణ్ అని పేర్కొంది. కాగా వికీపీడియాలో ఎవరైనా మార్పులు(ఎడిట్) చేసే అవకాశముంది. దీంతో కొందరు కావాలనే వ్యూయర్స్‌ను తప్పుదోవ పట్టించేందుకు ఇలా ఎడిట్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి బిగ్‌బాస్ టీమ్‌తో ఎలాంటి సంబంధాలు ఉండవు.
News December 21, 2025
ములుగు: రేపు యథావిధిగా ప్రజావాణి: కలెక్టర్

ప్రజావాణి కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగిస్తున్నట్లు కలెక్టర్ దివాకర తెలిపారు. ములుగు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో ప్రజల నుంచి వినతుల స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. పంచాయతీ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించలేదన్నారు. కోడ్ ముగిసినందున ప్రతి సోమవారం వినతుల స్వీకరణ ఉంటుందని స్పష్టం చేశారు.
News December 21, 2025
రాజీ మార్గమే రాజా మార్గం: సివిల్ జడ్జి

రాజీయే రాజమార్గం అని, జాతీయ లోక్ అదాలత్‌తో సత్వర న్యాయం పొందవచ్చని ASF సెషన్ సివిల్ జడ్జ్ యువరాజ అన్నారు. ఆసిఫాబాద్ కోర్టు ఆవరణలో ఆదివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 11,022 కేసులను పరిష్కరించి, రూ.55,62,865 జరిమానా విధించినట్లు తెలిపారు. క్షణికావేశంతో నమోదు చేసుకున్న కేసులతో కోర్టుల చుట్టూ తిరుగుతూ డబ్బు, సమయం వృధా చేసుకోవద్దని సూచించారు.


