News March 19, 2025
బాపట్ల: రూ.149 కోట్ల పనులు మంజూరు

జలజీవన్ మిషన్ద కింద జిల్లాకు రూ.149 కోట్లతో 337 పనులు మంజూరు అయ్యాయని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి అన్నారు. బుధవారం బాపట్ల కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా స్థాయి సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జలజీవన్ మిషన్ క్రింద ప్రభుత్వం మంజూరు చేసిన పనులకు టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News November 11, 2025
సమాజాభివృద్ధికి జ్ఞానం అవసరం: ఎస్పీ

సమాజాభివృద్ధికి జ్ఞానం ఎంతో అవసరమని ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్య సమరయోధుడు, భారతదేశ తొలి విద్యామంత్రి, జ్ఞాన దీప్తి ప్రతీక అయిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని మంగళవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించారు. అనంరతం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన గొప్ప ఇస్లామిక్ పండితుడని కొనియాడారు.
News November 11, 2025
HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్.. టార్గెట్ DEC 2026

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. టార్గెట్ డిసెంబర్ 2026 అని GM సంజయ్ కుమార్ శ్రీ వాస్తవ తెలిపారు. అందుకు అనుగుణంగా పనుల్లో వేగం పెంచి ముందుకు వెళుతున్నట్లు వివరించారు. రూ.714 కోట్లతో కొనసాగుతున్న ఈ ప్రాజెక్టు, ప్రస్తుతం వెయిటింగ్ హాల్ నిర్మాణాలు, లాంగ్ స్పేస్, ఆర్కేడ్ నిర్మాణపు పనులు పూర్తయ్యాయి.
News November 11, 2025
బయో-కెమికల్ వార్: ఉగ్రసంస్థల కొత్త వ్యూహం

భారత్‌పై విషం చిమ్మేందుకు ఉగ్రసంస్థలు రూటు మార్చాయి. నిఘా, తనిఖీలు, సప్లై తదితర సవాళ్లు పెరగడంతో స్థానిక పదార్థాలతో నరమేధం సృష్టించే నైపుణ్యం గల వారిని రిక్రూట్ చేసుకుంటున్నాయి. రసాయనాలు, వాటితో మంచి చెడులు వైద్యులకు తెలియడంతో వారినే పావులుగా మారుస్తున్నాయి. ఆముదాలతో రెసిన్ విషం తయారుచేస్తూ పట్టుబడ్డ HYD Dr. మొయిన్, ఫరీదాబాద్‌లో అమ్మోనియం నైట్రేట్ యూరియాతో దొరికిన ముగ్గురు వైద్యులు ఇందుకు ఉదాహరణ.


