News April 24, 2025
బాపట్ల: రూ.25 లక్షలతో కొళాయిలు- కలెక్టర్

బాపట్ల జిల్లా చినగంజాం మండలంలోని చిన్న కొత్త గొల్లపాలెంలో జల జీవన్ మిషన్ కింద రూ.25 లక్షలతో కొళాయి కనెక్షన్లు ఇస్తున్నట్లు కలెక్టర్ వెంకట మురళి బుధవారం తెలిపారు. సీఎం పర్యటనలో భాగంగా ఇచ్చిన హామీల అమలుపై జిల్లా అధికారులతో బుధవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రతి ఇంటికి తాగునీరు అందించడానికి జల జీవన్ మిషన్ కింద పనులు మంజూరు చేసినట్లు కలెక్టర్ చెప్పారు.
Similar News
News April 24, 2025
UPSC సివిల్స్ పరీక్షలలో సత్తా చాటిన CRDA అధికారి

ఏపీ సీఆర్‌డీఏ ఎకనామిక్ డెవలప్మెంట్ విభాగంలో జాయింట్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న బడబాగ్ని వినీష UPSC సివిల్స్-2024 పరీక్షలలో 467వ ర్యాంక్ సాధించారు. ఓ పక్క ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ కఠినమైన సివిల్స్ పరీక్షలో ర్యాంక్ సాధించిన వినీషను పలువురు అభినందించారు. IAS/IFS క్యాడర్ అధికారిగా ప్రజలకు మరింతగా సేవలందిస్తానని వినీష ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
News April 24, 2025
భూ భారతి చట్టం పేద రైతుల చుట్టం: కడియం

భూ భారతి చట్టం పేద రైతులకు చుట్టమని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. రఘునాథపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన భూ భారతి అవగాహన సదస్సులో ఎమ్మెల్యే కడియం శ్రీహరి కలెక్టర్ రిజ్వాన్ భాషాతో కలిసి పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. ధరణిలో అనేక లోపాలు ఉన్నాయని వాటి ద్వారా రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని ఆరోపించారు.
News April 24, 2025
SRD: ‘పాఠశాల బలోపేతానికి ఉపాధ్యాయులు కృషి చేయాలి’

విద్యారంగా సమస్యలపైన బుధవారం విద్యా శాఖ కార్యదర్శి యోగితా రానా ఉపాధ్యాయ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. పాఠశాల అభివృద్ధిలో ఉపాధ్యాయుల కృషి తప్పనిసరి అని, పాఠశాల బలోపేతానికి ఉపాధ్యాయులు అందరూ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ నరసింహ రెడ్డి, సాంకేతిక విద్యా కమిషనర్ దేవసేన, అధికారులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.