News February 2, 2025
బాపట్ల: రేపటి కార్యక్రమం రద్దు
జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ జె.వెంకట మురళి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నామని కలెక్టర్ చెప్పారు. జిల్లాలోని ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
Similar News
News February 2, 2025
కల్వకుర్తి: కునుకు తీసిన గుడ్లగూబ
కల్వకుర్తి పట్టణం గాంధీనగర్ కాలనీలోని ఓ దుకాణం వద్ద ఓ గుడ్లగూబ ఆదివారం కునుకు తీస్తూ కనిపించింది. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ నిద్రపోతున్న గుడ్లగూబను కాలనీ ప్రజలు, అటుగా వెళ్లేవారు ఆసక్తిగా తిలకించారు. అడవిలో ఉండే ఈ పక్షి కాంక్రీట్ జంగిల్‌గా మారిన పట్టణంలో కునుకు తీస్తూ కనిపించటంతో ఆసక్తి నెలకొంది. ఈ గుడ్లగూబను పలువురు కెమెరాలో బంధించారు.
News February 2, 2025
షాద్‌నగర్‌కు పండ్ల మార్కెట్ వస్తుందా?
షాద్‌నగర్ పట్టణంలో పండ్ల మార్కెట్ లేక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక్కడ మామిడి, సీతాఫలం, జామ తోటలు అత్యధికంగా ఉంటాయి. ఇక్కడ దిగుబడులు వివిధ ప్రాంతాలకు వెళ్తుంటాయి. కానీ పండ్ల మార్కెట్ లేక రోడ్ల మీదే అమ్మకాలు కొనసాగిస్తూ రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అమ్మకాల కోసం పట్టణ శివారులో వేసిన షెడ్ శిథిలమైపోయింది. మామిడి సీజన్ వస్తున్నందున వెంటనే పండ్ల మార్కెట్ నిర్మించాల్సిన అవసరం ఉంది.
News February 2, 2025
రూ.12,500 కోట్లు తిరిగివ్వనున్న రక్షణ శాఖ.. ఎందుకంటే
గత ఏడాది బడ్జెట్లో తమకు చేసిన కేటాయింపుల్లో రూ.12,500 కోట్లను రక్షణ శాఖ కేంద్రానికి తిరిగివ్వనుంది. డిఫెన్స్ డిపార్ట్‌మెంట్ చేపట్టిన పలు కొనుగోళ్లు వివిధ కారణాలతో జాప్యం కావడంతో వాటి కోసం కేటాయించిన నిధులు మిగిలిపోయాయి. ఆ నిధుల్ని ప్రభుత్వానికి తిరిగిస్తున్నట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో రూ.6.81 లక్షల కోట్లను రక్షణ శాఖకు కేంద్రం కేటాయించింది.