News April 11, 2025

బాపట్ల: రేపే ఇంటర్ ఫలితాలు

image

ఇంటర్ ఫలితాలు రేపు విడుదల కానున్న నేపథ్యంలో విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. తొలిసారి ఇంటర్ పరీక్షలు రాసిన ఫస్ట్ ఇయర్ విద్యార్థుల కంటే ఎక్కువగా, భవిష్యత్ లక్ష్యాలపై ఆశలు పెట్టుకున్న సెకండ్ ఇయర్ విద్యార్థుల్లో ఆత్రుత కనిపిస్తోంది. బాపట్ల జిల్లాలో ఫస్టియర్ 10,838, సెకండియర్ 8,381, మొత్తం 19,219 మంది పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఫలితాల కోసం Way2News ఫాలో అవ్వండి.

Similar News

News November 5, 2025

APSRTCలో 277 పోస్టులు.. దరఖాస్తు చేశారా?

image

<>APSRTC‌<<>>లో 277 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి నవంబర్ 8 ఆఖరు తేదీ. టెన్త్, ఐటీఐ అర్హతగల అభ్యర్థులు ముందు www.apprenticeshipindia.gov.in నమోదు చేసుకోవాలి. అనంతరం వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి జిల్లాను ఎంచుకుని పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు రూ.118. వెబ్‌సైట్: https://apsrtc.ap.gov.in/ మరిన్ని జాబ్స్ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.

News November 5, 2025

గొల్లప్రోలు: మైనర్‌పై అత్యాచారం.. నిందితుడికి జైలు శిక్ష

image

గొల్లప్రోలుకు చెందిన మచ్చ రామ్మోహన్‌కు పోక్సో కోర్టు జడ్జి కె. శ్రీదేవి జైలు శిక్ష, జరిమానా విధించారు. 2017లో 17 ఏళ్ల అమ్మాయిని కళాశాల నుంచి బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారం చేసిన ఘటనపై నమోదు అయిన కేసులో 8 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం న్యాయమూర్తి ఈ తీర్పు ఇచ్చారని సీఐ జి.శ్రీనివాస్ తెలిపారు. వాదనలు, ప్రతివాదనల అనంతరం న్యాయమూర్తి శిక్ష ఖరారు చేశారు.

News November 5, 2025

పెద్దూరులో అత్యధిక వర్షపాతం నమోదు

image

నాగర్‌కర్నూల్ జిల్లాలో గడచిన 24 గంటలో వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా తెలకపల్లి మండలం పెద్దూరులో 69.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కుమ్మెర 57.3, వెల్దండ 41.8, కల్వకుర్తి, యంగంపల్లి 40.0, బొల్లంపల్లి 39.0, ఊర్కొండ 33.3, ఉప్పునుంతల 30.8, పెద్దకొత్తపల్లి 20.0, తెలకపల్లి 19.3, వంకేశ్వర్ 14.0, లింగాల 9.8, మంగనూరులో 1.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.