News August 16, 2025
బాపట్ల: రైలులో అధికారుల తనిఖీలు

మాదకద్రవ్యాలు అరికట్టడానికి ఈగల్ టీం రంగంలోకి దిగింది. బాపట్ల రైల్వే స్టేషన్‌లో నిలిచిన ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో క్షుణ్ణంగా తనిఖీలు చేసింది. బాపట్ల నుంచి ఒంగోలు వరకు చెకింగ్ కొనసాగించారు. ఎస్బీ ఎస్ఐ శ్రీనివాసరావు, చీరాల 1టౌన్ ఎస్ఐ హరి బాబు, చీరాల జీఆర్పీ ఎస్ఐ కొండయ్య తనిఖీల్లో పాల్గొన్నారు. డ్రగ్స్ రవాణాకు అడ్డుకట్ట వేయడంలో భాగంగా తనిఖీలు చేసినట్లు చెప్పారు.
Similar News
News August 16, 2025
పీలేరు: మూడో ఫ్లోర్ నుంచిపడి రిటైర్డ్ SI మృతి

అన్నమయ్య జిల్లాలోని పీలేరులో విషాద ఘటన చోటుచేసుకుంది. పీలేరులోని బీసీ కాలనీలో ఉండే రిటైర్డ్ SI వెంకటరమణ శనివారం తన ఇంటి మూడో ఫ్లోర్ పైన సాయంత్రం పూలు కోస్తున్నాడు. ప్రమాదవశాత్తు కిందపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఇతనికి భార్యా పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News August 16, 2025
ఎమ్మెల్యే కూనపై YCP ఆరోపణల్లో నిజం లేదు

పొందూరు కేజీబీవీ ప్రిన్సిపల్ ఎమ్మెల్యే కూన రవికుమార్‌పై నిరాధారణమైన ఆరోపణలు చేయడం తగదని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తమ్మినేని గీత అన్నారు. ఆమదాలవలస టీడీపీ కార్యాలయంలో శనివారం మీడియాతో ఆమె మాట్లాడారు. ఎమ్మెల్యే రవికుమార్ తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ రోజు మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించలేదని అన్నారు. ప్రిన్సిపల్ తన ఉద్యోగరీత్యా అవినీతికి పాల్పడ్డారన్నారు. ఎమ్మెల్యేపై YCP ఆరోపణల్లో నిజం లేదన్నారు.
News August 16, 2025
HYD: అదుపుతప్పిన వాహనం.. కిందపడిపోయిన విగ్రహం

ఆరాంఘర్ శివారు మార్గంలో శనివారం రోడ్డుపై గణేశ్ విగ్రహం పడిపోయింది. వాహనం అదుపుతప్పి విగ్రహం ఒకేవైపు ఒరిగి, కిందపడిపోయినట్లు వాహనదారులు తెలిపారు. రోడ్డుకు అడ్డుగా భారీ ప్రతిమ పడిపోవడంతో ఆ రూట్‌లో ట్రాఫిక్ జామైంది. పోలీసులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. వాహనదారులు ఇతర మార్గాల్లో వెళ్లాలని సూచిస్తున్నారు. మండపానికి తీసుకెళ్తుంటే ఊహించని సంఘటన ఎదురైందని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు.