News March 22, 2024
బాపట్ల: విద్యార్థిని కొట్టిన ఉపాధ్యాయుడి సస్పెండ్

బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో పాలిటెక్నిక్ చదువుతున్న బోనిగల నవదీప్ అనే విద్యార్థిని ఉపాధ్యాయుడు విచక్షణ రహితంగా కొట్టడంతో అతనిపై చర్యలు తీసుకుంటూ యాజమాన్యం సస్పెండ్ చేసింది. విద్యార్థిని కౌన్సిలింగ్ చేసే క్రమంలో ఉపాధ్యాయుడు విచక్షణ కోల్పోయి దాడి చేయడంతో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. ఉపాధ్యాయుడిని శిక్షించాలని దళిత సంఘ నేతలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో అతడిని సస్పెండ్ చేశారు.
Similar News
News September 27, 2025
అతిసార వ్యాధి నియంత్రణలో ఉంది: కలెక్టర్

గుంటూరు జిల్లాలో అతిసార వ్యాధి నియంత్రణలో ఉందని కలెక్టర్ ఎం. తమీమ్ అన్సారియా తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ చెప్పారు. జిల్లాలో మొత్తం 177 కేసులు నమోదయ్యాయని, వాటిలో 152 కేసులు గుంటూరు పట్టణం నుంచి, 25 కేసులు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చాయని ఆమె వివరించారు. ఈ వ్యాధిని పూర్తిగా అదుపులోకి తెచ్చేందుకు అధికారులు కృషి చేస్తున్నారన్నారు.
News September 27, 2025
అమరావతిలో IIULER ఏర్పాటుకు AP అసెంబ్లీ ఆమోదం

అమరావతిలో IIULER ఏర్పాటుకు AP అసెంబ్లీ ఆమోదం తెలిపింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు ప్రారంభానికి రంగం సిద్ధం చేయనున్నారు. క్యాంపస్ కోసం నామమాత్రపు లీజుకు (₹1/చ.మీ) 55 ఎకరాలు కేటాయించారు. AP విద్యార్థులకు 20% సీట్లు రిజర్వు చేయబడ్డాయి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ నిబంధనలు ఉంటాయని, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ కింద నడుస్తుంది. అసెంబ్లీలో బిల్లులను ప్రవేశపెట్టారు.
News September 26, 2025
ANU: పీజీ సెకండ్ సెమిస్టర్ ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పీజీ సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్ ఫలితాలను పరీక్షల నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు శుక్రవారం విడుదల చేశారు. జులై నెలలో జరిగిన డీపీఈడీ, బీపీఈడీ, ఎంపీఈడీ, ఎంఏ డాన్స్, ఎంఏ డాన్స్ కూచిపూడి పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. రీవాల్యుయేషన్ కోసం ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 13వ తేదీ లోపు రూ.1,860 చెల్లించాలన్నారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్ సంప్రదించాలన్నారు.