News February 14, 2026

బాపట్ల: విద్యుత్ దీపాలతో దేవాలయాలు

image

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బాపట్ల జిల్లాలోని శివాలయాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తుల సౌకర్యార్థం తాగునీరు, క్యూలైన్లు, విద్యుత్ దీపాలంకరణ, భద్రతా చర్యలు సిద్ధం చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Similar News

News February 17, 2026

అప్పుడు క్లీన్‌స్వీప్.. ఇప్పుడు జీరో!

image

TG: సర్పంచ్ ఎన్నికల్లో కాస్త సత్తా చాటిన BRS మున్సిపల్ ఎన్నికల్లో చతికిలపడింది. 7 కార్పొరేషన్లలో ఒక్క చోట కూడా మేయర్ <<19160296>>పదవి<<>> దక్కించుకోలేకపోయింది. 2020లో ఆ పార్టీ పదికి పది కార్పొరేషన్లు సొంతం చేసుకోవడం గమనార్హం. అటు 116 మున్సిపాలిటీల్లో 18 చోట్ల మాత్రమే ఛైర్మన్ పీఠం కైవసం చేసుకుంది. ఇందులోనూ 13 స్థానాల్లో పూర్తి మెజార్టీ ఉండగా మిగతా 5 చోట్ల కాంగ్రెస్, ఇతరులతో పొత్తు పెట్టుకొని పదవులు దక్కించుకుంది.

News February 17, 2026

‘కుతల ఆర్భాటమే కానీ కుప్పలో గింజలు లేవు’

image

కొందరు వ్యక్తులు తమకు అన్నీ తెలుసని, తాము చాలా గొప్పవారమని గంభీరమైన మాటలు చెబుతుంటారు. కానీ పని అప్పగిస్తే ఏమీ చేయలేరు. అలాగే పెద్ద కుప్పలా ఉన్న ధాన్యాన్ని గాలికి ఎగబోసేటప్పుడు అందులో నుంచి శబ్ధం(కుతల) వస్తుంది. తీరా చూస్తే అందులో అసలైన గింజలు (ధాన్యం) లేకుండా, కేవలం పొట్టు లేదా తాలు మాత్రమే ఉంటే “వట్టి కుతల ఆర్భాటమే తప్ప, కుప్పలో గింజలు లేవు” అనే సామెతను రైతులు వాడుతుంటారు.

News February 17, 2026

అధిక మాసం ఎలా ఏర్పడుతుందో తెలుసా?

image

భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 365.25 రోజులు పడుతుంది. అయితే చంద్రుని గమనం ఆధారంగా 12 మాసాలకు 354 రోజులు పడుతుంది. ఈ రెండింటి మధ్య ఏటా వచ్చే 11 రోజుల తేడాను సవరించడానికి ప్రతి మూడేళ్లకు ఓసారి ఓ నెలను అదనంగా కలుపుతారు. దీనినే అధిక మాసం అంటారు. ఏ మాసంలో అయితే సూర్య సంక్రమణం జరగదో ఆ నెలను అధిక మాసంగా పరిగణిస్తారు. ఇది పండుగలు, రుతువుల క్రమం తప్పకుండా ఉండటానికి సహాయపడుతుంది.