News January 16, 2026
బాపట్ల: వెలుగులోకొచ్చిన 500ఏళ్ల గణపయ్య విగ్రహం!

అద్దంకి మండలం కొత్త రెడ్డిపాలెంలో పురాతన ఉండ్రాళ్ల గణపతి విగ్రహం గురువారం వెలుగులోకి వచ్చింది. కొత్త రెడ్డిపాలెం-చిన్న కొత్తపల్లి గ్రామాల మధ్య ఓ రైతు పొలంలో ఈ విగ్రహం బయటపడింది. పురావస్తు పరిశోధకులు జ్యోతి చంద్రమౌళి విగ్రహాన్ని పరిశీలించి 500 ఏళ్ల నాటి విగ్రహంగా ఆయన పేర్కొన్నారు. ఉండ్రాళ్ల గణపతి విగ్రహానికి గ్రామస్థులు పూజలు చేశారు
Similar News
News February 19, 2026
కర్రెగుట్టల్లో ఆపరేషన్-2 కగార్ స్టార్ట్

తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో ఆపరేషన్-2 కగార్ స్టార్ట్ అయింది. మావోయిస్ట్ అగ్రనేతలే లక్ష్యంగా దీన్ని ప్రారంభించారు. 5 వేల మంది CRPF బలగాలతో కూంబింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పలువురు అగ్రనేతలు లొంగుబాటుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. కాగా ఆపరేషన్ కగార్ డెడ్‌లైన్(మార్చి 31)కు ఇంకా 40 రోజులే మిగిలి ఉంది.
News February 19, 2026
KNR: వివాహిత ఆత్మహత్య.. కారణమిదే!

అత్తింటి వేధింపులు తాళలేక KNRలో మమత అనే <<19178040>>వివాహిత ఆత్మహత్య<<>> చేసుకున్న ఘటనలో దిగ్భ్రాంతికర నిజాలు వెలుగుచూశాయి. పెళ్లైన నెల నుంచే అత్త చిన్నక్క, మామ భూమయ్య, ఆడపడుచు కవిత కట్నం కోసం వేధించారని బాధితురాలి తండ్రి పోషయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త ఆస్పత్రిలో ఉండగా తనను, సోదరుడు మహేశ్‌ను అత్తమామలు దూషించడంతో మనస్తాపం చెంది మమత బలవన్మరణానికి పాల్పడినట్లు తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.
News February 19, 2026
గద్వాల: కాబోయే భర్త వేధింపులు.. యువతి SUICIDE..!

కేటీదొడ్డి మండలం చింతలకుంటలో ఓ యువతి(18) ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. యువతి ఆత్మహత్యకు ఆమెతో నిశ్చితార్థమైన హరి వేధింపులే కారణంగా తెలుస్తోంది. గతంలో యువకుడి మొదటి భార్య కూడా ఇలాగే బలైందన్నారు. ఫిర్యాదు అందిన వెంటనే చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.


