News January 12, 2026

బాపట్ల: సంక్రాంతికి ఊర్లు వెళ్తున్నారా.. జాగ్రత్త

image

సంక్రాంతి పండగ వేళ ఇతర గ్రామాలకు వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలని బాపట్ల జిల్లా పోలీసులు ప్రజలకు పలు సూచనలు చేశారు. సెలవులకు వెళ్లే వారు సోషల్ మీడియాలో ఎలాంటి సమాచారం వెల్లడించరాదన్నారు. దొంగలు ఇదే అదునుగా తీసుకుని దొంగతనాలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. ఇళ్లకు తాళాలు వేసుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసర వేళల్లో 100 కు డైల్ చేయాలని సూచించారు.

Similar News

News February 6, 2026

ఆ ఒక్క స్టార్టప్ విలువ.. మన 10 బడా IT కంపెనీల కంటే ఎక్కువ!

image

ఆంథ్రోపిక్ పేరు ఇప్పుడు IT ఇండస్ట్రీలో మారుమోగుతోంది. ఈ స్టార్టప్ తెచ్చిన టూల్‌తో ఇండియన్ IT కంపెనీల షేర్లు బెంబేలెత్తిపోయాయి. ఈ నేపథ్యంలో SM వేదికగా ఒక ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. రీసెంట్ ఫండింగ్ తర్వాత ఆంథ్రోపిక్ మార్కెట్ విలువ $350 బిలియన్లకు చేరింది. అదే టైమ్‌లో ఇండియాలోని టాప్-10 IT కంపెనీల విలువ దాదాపు $330 బిలియన్లకు పడిపోయింది. అంటే ఆ ఒక్క కంపెనీ వాల్యూ మన 10 కంపెనీల కంటే ఎక్కువ!

News February 6, 2026

లడ్డు వివాదంపై అసత్య ప్రచారాలు ఆపాలి: SV మోహన్ రెడ్డి

image

తిరుమల లడ్డు అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వివాదంగా మార్చడం తగదని కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం కర్నూలులోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. లడ్డులో జంతు కొవ్వు కలవలేదని దర్యాప్తు సంస్థల నివేదికలు స్పష్టం చేసినా, కూటమి నేతలు ఇంకా అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా అబద్ధపు ప్రచారాలు మానుకోవాలని ఆయన హితవు పలికారు.

News February 6, 2026

పీయూలో స్కిల్ డెవలప్మెంట్‌పై ఆన్‌లైన్ సమావేశం

image

పాలమూరు విశ్వవిద్యాలయం అకాడమిక్ ఆడిట్ సెల్ ఆధ్వర్యంలో డిగ్రీ విద్యార్థుల కోసం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంపై ఆన్‌లైన్ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఉపకులపతి ప్రొ.జి.ఎన్ శ్రీనివాస్ పాల్గొని, ఇంగ్లీష్ కమ్యూనికేషన్, నాయకత్వ నైపుణ్యాలు పెంపొందించుకోవడం అవసరమని సూచించారు. రిజిస్ట్రార్ ప్రొ. పి.రమేష్ బాబు, అకాడమిక్ డైరెక్టర్ చంద్ర కిరణ్, అన్ని డిగ్రీ కాలేజీల ప్రిన్సిపల్స్‌ పాల్గొన్నారు.