News February 9, 2025

బాపట్ల: 12 మద్యం షాపులకు 159 దరఖాస్తులు

image

బాపట్ల జిల్లాలో గీత కులాలకు కేటాయించిన 12 మద్యం షాపులకు 159 దరఖాస్తులు వచ్చినట్లు బాపట్ల జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి దేవదత్తు తెలిపారు. శనివారం సాయంత్రం 5 గంటలకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసిందని, పదో తేదీన బాపట్ల కలెక్టరేట్ కార్యాలయంలో లాటరీ ప్రక్రియ ద్వారా షాపులు కేటాయిస్తామన్నారు. దరఖాస్తుదారులు 10వ తేదీ ఉదయం 8 గంటలలోపు హాజరుకావాలని సూచించారు.

Similar News

News February 9, 2025

‘ఏకగ్రీవాలకు’ ఎన్నికల సంఘం చెక్!

image

TG: ‘స్థానిక’ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఏకగ్రీవాలు లేకుండా ఒక్క నామినేషన్ నమోదైనా ‘నోటా’ను రెండో పోటీదారుగా పేర్కొంటూ ఎన్నిక నిర్వహించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఈ విధానం ఇప్పటికే హరియాణా, MHలో అమల్లో ఉంది. దీనిపై ఈనెల 12న రాజకీయ పార్టీలతో చర్చించనుంది. అయితే పార్టీలు ఓకే చెప్పినా ప్రభుత్వం అంగీకరిస్తుందా? అనేది ఆసక్తిగా మారింది.

News February 9, 2025

కరీంనగర్: రేపటితో ముగియనున్న నామినేషన్లు

image

KNR, ADLBD, NZBD, MDK పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికకు రేపటితో నామినేషన్ల గడువు ముగియనుంది. ఇప్పటిదాకా BJP, కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు 49 మంది నామినేషన్ వేశారు. ఉపాధ్యాయ స్థానానికి బీజేపీ అభ్యర్థితో పాటు PRTUTS, TPTF అభ్యర్థులు, సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, మరో 5గురు నామినేషన్లు వేశారు. పట్టభద్రుల స్థానంలో ప్రస్తుతం కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

error: Content is protected !!