News December 28, 2025
బాపట్ల: 2 ప్రాణాలు బలిగొన్న ఘటనలో నిర్లక్ష్యం ఎవరిది..?

బాపట్ల జిల్లా వేమూరులో జరిగిన విషాద ఘటనలో<<18689315>> నిర్లక్ష్యం ఎవరిదని<<>> ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వేమూరు పంచాయతీ బేతేలుపురం వద్ద కూలిపనికి వెళ్లి కిందకు వేలాడుతున్న వైరు తగలడంతో సునీల్ (21) మృతి చెందడంతో తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. వైర్లు కిందికి ఉన్నా విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మృతుడు సునీల్ భార్య నిండు గర్భిణి కావడంతో ఆమెకు అధికారులు న్యాయం చేయాలని అన్నారు.
Similar News
News December 30, 2025
గ్రూప్-2 రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ల కొట్టివేత

AP: గ్రూప్-2 రిజర్వేషన్లపై దాఖలైన అన్ని పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. రిజర్వేషన్ల పాయింట్లను సవాల్ చేస్తూ 2023లో ఇచ్చిన గ్రూప్-2 నోటిఫికేషన్‌ను రద్దు చేయాలంటూ పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్ రోస్టర్ పాటించాలని కోరారు. వీటిపై విచారణ చేపట్టిన ధర్మాసనం కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది.
News December 30, 2025
అరటి గెలల నాణ్యత పెరగాలంటే?

అరటిలో పండు పరిమాణం, నాణ్యత పెంచేందుకు గెలల్లోని ఆఖరి హస్తం విచ్చుకున్న 5వ రోజు మరియు 15వ రోజున లీటరు నీటికి సల్ఫేట్ ఆఫ్ పొటాష్ 5 గ్రాములను కలిపి గెలలపై పిచికారీ చేయాలి. దీనితో పాటు 2 శాతం రంద్రాలు చేసిన తెల్లని పారదర్శక పాలిథీన్ సంచులను గెలలకు తొడగాలి. దీని వల్ల అరటిపండ్ల పరిమాణం పెరిగి లేత ఆకుపచ్చ రంగులో ఆకర్షణీయంగా తయారై నాణ్యమైన పండ్లను పొందవచ్చు. ఇవి ఎగుమతికి అనుకూలంగా ఉంటాయి.
News December 30, 2025
ఈ ఏడాది నేరాలను తగ్గుముఖం పట్టించాం: విశాఖ సీపీ

విశాఖలో పోలీసులు చేసిన కృషి వల్ల 17 విభాగాల్లో గత ఏడాది కంటే నేరాలకు సంబంధించిన కేసుల సంఖ్య తగ్గించగలిగామని సీపీ శంఖబత్ర భాగ్చీ వెల్లడించారు. వార్షిక ముగింపులో భాగంగా ఆయన మాట్లాడారు. గత ఏడాది 5,921 కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది 5,168 కేసులు నమోదయ్యాయని చెప్పారు. మర్డర్ కేసులు 35 నమోదు కాగా.. కిడ్నాప్ కేసులు 17, హత్యాయత్నం కేసులు 135 నమోదు చేసినట్లు తెలిపారు.


