News December 16, 2025

బాపట్ల: 3 ఏళ్ల నిరీక్షణకు.. నేటితో తెర..!

image

కానిస్టేబుల్ నోటిఫికేషన్ 2022 నవంబర్‌లో విడుదలై నేటికీ దాదాపు 3 సంవత్సరాలు పూర్తయింది. ప్రభుత్వం కోర్టు కేసులు పరిష్కరించి అర్హత గల కానిస్టేబుల్ అభ్యర్థుల జాబితాను ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎంపికైన వారికి నేడు మంగళగిరిలోని జరిగే కార్యక్రమంలో సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు ఇవ్వనున్నారు. ఇప్పటికే బాపట్ల జిల్లా అభ్యర్థులు తమ కుటుంబ సభ్యులతో కలిసి బస్సుల్లో మంగళగిరి చేరుకున్నారు.

Similar News

News December 18, 2025

సినిమాను తలపించేలా.. పెళ్లి వేదికపైనే

image

నాగ చైతన్య, తమన్నా నటించిన 100% లవ్ మూవీ గుర్తుందా? ఆ సినిమా ప్రీ-క్లైమాక్స్ సీన్‌లో హీరో కంపెనీకి ఒక సమస్య వస్తే ఓవైపు పెళ్లి పనులు జరుగుతుండగానే దానిని సాల్వ్ చేస్తుంది తమన్నా. దీనిని తలపించే సంఘటన రియల్ లైఫ్‌లో జరిగింది. కోయల్AI CEO సోదరి పెళ్లైన 10 నిమిషాల్లోనే తమ కంపెనీలో ఏర్పడిన బగ్‌ను పరిష్కరించడం SMలో వైరల్‌గా మారింది. కొందరు ఆమె డెడికేషన్‌ను ప్రశంసిస్తుండగా మరికొందరు విమర్శిస్తున్నారు.

News December 18, 2025

సమష్టి సహకారంతో ఎన్నికలు విజయవంతం: ఎస్పీ

image

జిల్లాలో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు విడతలుగా పూర్తిగా శాంతియుత వాతావరణంలో విజయవంతంగా ముగిశాయని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ప్రకటించారు. ప్రజల సహకారం, అధికారుల సమన్వయం, పోలీసు విభాగం కర్తవ్య నిష్ఠతో పని చేయడం ఈ ఎన్నికల విజయానికి ప్రధాన కారణమని తెలిపారు. ఎన్నికల భద్రత కోసం అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు, 950 మంది పని చేసినట్లు చెప్పారు.

News December 18, 2025

సాయంత్రం 5 గంటలకు ఎన్నికల కోడ్ ఎత్తివేత

image

TG: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఎన్నికల కోడ్‌ ఎత్తివేయనున్నట్లు పేర్కొంది. ఎన్నికల విధుల్లో మరణించిన అధికారుల కుటుంబాలకు పరిహారం చెల్లిస్తామని పేర్కొంది. బాధిత కుటుంబాలకు పరిహారం అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ నెల 11, 14, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు జరగగా NOV 25 నుంచి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది.