News December 9, 2025

బాపట్ల: 32 కంపెనీలు.. 10 పాసైతే ఉద్యోగం

image

పొన్నూరులోని వెలగా నాగేశ్వరరావు ఇంజినీరింగ్ కాలేజీలో AP స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈనెల 12న మెగా జాబ్ మేళా నిర్వహించనుంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మేళాలో పాల్గొనవచ్చని నిర్వాహకులు తెలిపారు. మేళాలో 32 కంపెనీలు పాల్గొంటాయన్నారు. SSC నుంచి PG వరకు చదివిన యువత బయోడేటా, సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు. ఆసక్తి కలిగిన వారు రిజిస్ట్రేషన్ లింక్ https://naipunyam.ap.gov.in/user-registration.

Similar News

News December 12, 2025

విశాఖను మరో స్థాయికి తీసుకెళ్తాం: చంద్రబాబు

image

విశాఖ లాంటి బ్యూటిఫుల్ సిటీ దేశంలో ఎక్కడా లేదని సీఎం చంద్రబాబు అన్నారు. పర్యాటకంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చెందగలిగే అద్భుతమైన సిటీ అని పేర్కొన్నారు. ఈ ప్రాంతాన్ని మరోస్థాయికి తీసుకెళ్తామన్నారు. వచ్చే ఏడాదిలో 25 వేల మంది పనిచేసే సంస్థగా కాగ్నిజెంట్‌ మారుతుందని అన్నారు. నాలెడ్జ్ ఎకానమీ, టెక్నాలజీకి విశాఖ కేంద్రమవుతుందని చెప్పారు. త్వరలో భోగాపురం ఎయిర్ పోర్టు, విశాఖ మెట్రో వస్తుందని పేర్కొన్నారు.

News December 12, 2025

సిరిసిల్ల: పంచాయతీ ఎన్నికల్లో ఎంపీపీలకు మిశ్రమ ఫలితాలు

image

జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికలలో పోటీ చేసిన మాజీ ఎంపీపీలకు మిశ్రమ ఫలితాలు లభించాయి. వేములవాడ రూరల్ మండలం వట్టెంల నుంచి పోటీ చేసిన మాజీ ఎంపీపీ రంగు వెంకటేష్ గౌడ్ విజయం సాధించగా, హనుమాజీపేటలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్, మాజీ ఎంపీపీ తీగల రవీందర్ గౌడ్, చందుర్తిలో మాజీ ఎంపీపీ చిలుక పెంటయ్య, రుద్రంగిలో మాజీ ఎంపీపీ గంగం స్వరూప ఓటమి పాలయ్యారు.

News December 12, 2025

నాగారం: సర్పంచిగా నిలబడటం, గెలుపొందడం రికార్డే

image

నాగారం సర్పంచ్‌గా రామచంద్రారెడ్డి గెలిచి రాజకీయాల్లో ఓ సంచలనం సృష్టించారనే చెప్పవచ్చు. 95 ఏళ్ల వయసులో పోటీలో నిలబడటమే కాదు, గెలవడం కూడా ఈ రోజుల్లో రికార్డే. నేటి యువతతో కలిసి మెజారిటీతో గెలవడం వందేండ్లకు చేరువైన ఈ నవయువకుడికి ఓ మధురానుభూతి. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తండ్రి అయిన ఈ బాపు.. శేష జీవితాన్ని గ్రామాభివృద్ధి కోసం అంకితం ఇస్తానన్నారు.