News February 23, 2026

బాపట్ల: 82 కేంద్రాల్లో ‘పది’ పబ్లిక్ పరీక్షలు

image

జిల్లాలో మార్చి 16 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లాలో మొత్తం 15,944 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. అందులో బాలురు 7,977 మంది, బాలికలు 7,967 మంది ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 82 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.

Similar News

News February 23, 2026

పుష్కరాల కోసం పటిష్ఠ ఏర్పాట్లు: కలెక్టర్

image

రానున్న గోదావరి పుష్కరాలకు పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. సోమవారం దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్‌ నిర్వహించిన వీసీలో ఆమె మాట్లాడారు. బాసరలో భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడించారు. భక్తులకు ఇబ్బందుల్లేకుండా పుష్కర ఘాట్లు, తాగునీరు, మరుగుదొడ్లు, పార్కింగ్ వసతులు కల్పిస్తామన్నారు. వీసీలో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

News February 23, 2026

ఇంటర్ పరీక్షలపై పెద్దపల్లి కలెక్టర్ సమీక్ష

image

ఈనెల 25 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ పరీక్షలు జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన సమీకృత కలెక్టరేట్లో అదనపు కలెక్టర్లు అరుణశ్రీ, వేణుతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు. మొత్తం 22 కేంద్రాలలో 10367 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రం వద్ద ప్రతి విద్యార్థినీ క్షుణ్ణంగా చెక్ చేయాలని సూచించారు.

News February 23, 2026

రేపు ఆదిలాబాద్‌లో కేటీఆర్ పర్యటన

image

ఈనెల 24న మంగళవారం ఆదిలాబాద్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటిస్తున్నట్లు మాజీ మంత్రి జోగురామన్న తెలిపారు. ఉదయం 11 గంటలకు జిల్లా కేంద్రానికి చేరుకుంటారన్నారు. పర్యటనలో భాగంగా జిల్లా జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌తో పాటు బీఆర్ఎస్ నాయకులను పరామర్శించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని కేటీఆర్ పర్యటన విజయవంతం చేయాలని కోరారు.